మన ఇండియాలో గొప్ప ఇతిహాసాలలో ఒకటైన రామాయణం కూడా ఒకటి.. అయోగ పురుషుడు రాముడు గురించి ఎంత విన్న.. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా వింటూనే ఉంటాము. రామాయణం గురించి అందులో చెప్పబడిన కొన్ని సంఘటన గురించి ఇప్పటికి మన దేశంలో అక్కడక్కడ చర్చనీయాంశంగా ఉండనే ఉంటాయి.. అయితే కేవలం రామాయణం అంటే రాముడి జననం సీతారామ కళ్యాణం రామలక్ష్మణుల అరణ్యవాసం గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సీతారాములు నిద్రించిన ప్రదేశాన్ని కూడా చాలామంది చూసి ఉండరు.


ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రామసముద్రం గ్రామానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది.. ఆ రామసముద్రంలో ఒక బావి దగ్గర సీతారాములు సైతం నిద్రించారని అక్కడే స్నానాలు కూడా చేసేవారని గ్రామంలో ఉన్న పెద్దలు సైతం ఇప్పటికీ తెలియజేస్తూ ఉంటారు.. ఒకరోజు సీతారాములు వేటకి వెళ్ళినప్పుడు రామసముద్రం అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చీకటి పడడంతో ఆ గ్రామం నుంచి వెళ్లలేకపోవడంతో ఆ గ్రామంలోనే సీతారాములు ఉండవలసి వచ్చిందట..రాత్రివేళ సీతమ్మకు దాహం వేయడంతో ఆమె దాహం తీర్చాలని చుట్టుపక్కల నీరు కోసం రాముల వారు వెతికారట.


కానీ నీరు దొరకకపోవడంతో రాముల వారు తన చేతిలో ఉన్న బాణంతో ఒక్కసారిగా భూమిలోకి బాణం వదిలారు. అప్పుడు గంగాదేవి పైకి ఉద్భవించి సీతమ్మ దేవి దాహం తీర్చినట్లు అక్కడి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ బావిలో ఉన్న నీరుతో స్నానాలు చేస్తే పాపాలు సైతం తొలగిపోతాయనే నమ్మకాన్ని ఆ ఊరి ప్రజలు సైతం చుట్టుపక్కల ప్రాంత ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. అయితే ఆ గ్రామ ప్రజలు పాము కరిచిన తేలు కరిచిన ఇప్పటివరకు మరణించలేదట. అంత చరిత్ర గల ఊరు ఇది.. చాలా దూరం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా అక్కడ నిద్రించేవారట. అలాగే పిల్లలు పుట్టని వారికి కూడా పుడతారని.. అక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా సీతారాములు ఆంధ్రప్రదేశ్లోని రామసముద్రంలో  నిద్రించడం ఇప్పటికే అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: