అయోధ్యలో బాల రాముడు విగ్రహాన్ని ఇటీవలే ప్రాణ ప్రతిష్ట చాలా ఘనంగా జరిగింది. దాదాపుగా 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చారంటు కూడా దేశ ప్రజలు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. చాలా ప్రాంతాలలో కూడా అక్కడ ఉండేటువంటి రామ మందిరాల గుడులలో కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముఖ్యంగా రామ మందిరం ప్రారంభం రోజున దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం అలుముకున్నది. చాలామంది సినీ సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు కూడా ఈ ప్రాణ ప్రతిష్ట రోజున అయోధ్యకు వెళ్లడం జరిగింది దాదాపుగా మొదటి రోజు 5 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్య రాముని మందిరాన్ని దర్శించుకున్నారు.


ఇలా రోజు రోజుకి భక్తుల రద్దీ కూడా పెరుగుతూనే ఉంది. ఈ రామ్ లాల్ల విగ్రహాన్ని సైతం కర్ణాటక చెందిన  అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కడం జరిగింది...1076-1126 CE ముందు నుంచి అయోధ్యలో రామాలయం ఉండేదట.. అప్పుడే రామ్ లాల్ల విగ్రహం ఆరడుగుల పాటు బాలరాముడి విగ్రహం ఉండేదట. కాలక్రమంగా అక్రమాలు జరిగి అక్కడ చాలా విస్ఫోటనాలు సృష్టించారు కొంతమంది అగంతకులు.. ఆ తర్వాత  నెమ్మదిగా తవ్వకాలను జరిపినప్పుడు బాల రాముడు విగ్రహం బయటపడిందట..

దాదాపుగా మళ్లీ 700 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ రాముడు దర్శనం కోసం చాలామంది అయోధ్యకు వెళుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలోని AI అద్భుతాన్ని సృష్టించింది సాక్షాత్తు బాల రాముడు భక్తులను చూస్తున్నట్లుగా ఒక వీడియో. వైరల్ గా మారుతుంది ఈ అద్భుతమైన వీడియో చూసిన చాలామంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.రామ్ లాల్ల విగ్రహం కళ్ళు మెల్లగా తెరిచి చూడడాన్ని చాలామంది వీక్షిస్తున్నారు అయితే ఇదంతా కేవలం AI అద్భుతమైన సృష్టి అన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఎక్కువగా మనుషులు లేదా జంతువుల మేధస్సుకు చాలా భిన్నంగా ఉండేటువంటి సాఫ్ట్ వేరు. దీని ప్రకారంగానే ఇప్పుడు రామ్ లాల్ల విగ్రహాన్ని చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: