ఎంతోమంది త్యాగదనులు పోరాట ఫలితంగానే మనకు 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాము.. ఆ తర్వాత మనకు స్వాతంత్రం లభించింది.. బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించినటువంటి 1947 ఇండియన్ స్వాతంత్ర చట్టం కింద... రాజ్యాంగ అధినేత అయినటువంటి 6వ జార్జి ప్రభువు ఎర్ల్ మౌంట్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. అయితే అప్పట్లో రాజ్యాంగం లేనందువలన 1935 భారత ప్రభుత్వం చట్టం ఆధారంగా పాలన కొనసాగించేది. భారతీయ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.


ఈ కమిటీకి అధ్యక్షులుగా అంబేద్కర్, బాబాసాహెబ్ చాలా కీలకమైన బాధ్యతలు చేపట్టారట.. ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు కీలకమైన చర్యలతో నిర్వహించి ఎన్నో సవరణ చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించారట.. ఈ రాజ్యాంగం అప్పట్లో హిందీ ఇంగ్లీష్ భాషలలోనే చేతిరాతతోనే తయారు చేశారట. చివరిగా 1950 జనవరి 24న సంతకాలు చేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. అయితే అలా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26న ప్రత్యేకమైన రోజుగా మారిపోయింది.


అందుకే జనవరి 26న భారతీయులకు సైతం చారిత్రాత్మక రోజుగా పేరుగాంచింది.భారత స్వతంత్రం పోరాటానికి నాయకత్వం వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ఒక ప్రకటనను సైతం తెలియజేసి ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. దీనిని భారత గణతంత్ర దినోత్సవం గా దేశమంతట అమలులోకి వచ్చింది. ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రతి ఒక్కరు సైతం సంబరంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ రాజ్యాంగం పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువును నింపిన బ్రీఫ్ కేసులో పార్లమెంటులో చాలా భద్రంగా ఉంచారట అయితే ప్రస్తుతం ఉన్నది మన దగ్గర నకిలీ కాఫీలు అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: