సాధారణం గా మనం ఉండే ప్రాంతం లో కాస్త ఎండ ఎక్కువగా ఉంటేనే అమ్మ బాబోయ్ అనుకుంటాం.. ఒకవేళ చలి ఎక్కువగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి భయపడి పోతూ ఉంటాం. అలాంటిది ఏడాది పొడవున మంచు కురిసే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాసేపు బయట నిలబడ్డాము అంటే చాలు ఇక పూర్తిగా గడ్డకట్టుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఇక ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోతు ఉంటాయి.



 ఏకంగా మంచూ కురిసే ప్రాంతాల్లో ఉండే జనాలు కనీసం ఆహారం తినాలి అన్న కూడా ఎంతో జాగ్రత్త పడాలి. ఇక బయటకు వెళ్లి ఆహారం తినాలనుకుంటే తినే ఆహారం కూడా ఏకంగా ఐస్ ముక్కలా మారి పోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే అక్కడ పరిస్థితులు ఎంత దారుణం గా ఉంటాయో అన్నదానికి నిదర్శనం గా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయిన వీడియో ఒకటి నిలిచింది. ఏకంగా గడ్డకట్టే చలిలో ఒక వ్యక్తి వింత ప్రయోగం చేశాడు. ఏకంగా వేడి వేడి నూడిల్స్ ను నిమిషాల్లో గడ్డకట్టుకుపోయే చలిలో ఉంచాడు.



 అయితే అక్కడ చలి తీవ్రత ఎంత ఉంది అని కనుక్కునేందుకు ఇలాంటి ప్రయోగం చేశాడు సదరు వ్యక్తి  ఇందుకోసం ఒక బౌల్లో వేడి వేడి నూడిల్స్ తీసుకున్నాడు. స్టవ్ మీద ఉడుకుతున్న నూడిల్స్ను ఇంటి బయటకు తీసుకువెళ్లి మంచు గడ్డపై పెట్టాడు. ఇంకేముంది చూస్తూ చూస్తుండగానే పొగలు కక్కుతున్న నూడిల్స్ కాస్త చివరికి చల్లారిపోయి ఐస్ ముక్కల మారిపోయాయి. అయితే ఐస్ లో ఉంచే ముందు ఎలా అయితే అతను పెట్టాడో ఇక అలాగే ఫ్రీజ్ అయిపోయాయి నూడిల్స్. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: