
సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫుడ్ వీడియోలు కూడా వైరల్ గా మారడంతో భోజనానికి మంచి డిమాండ్ పెరిగింది ఒక్కసారి అయినా ఈమె చేతి వంట రుచి చూడాలని ఎక్కడెక్కడ నుంచో ప్రజలు ఈమె భోజనం సెంటర్ వద్దకు వస్తున్నారు. జనాలతో కిక్కిరిస్తోంది. అయితే రోడ్డు పక్కన ఈ ఫుడ్ సెంటర్ నిర్వహించడంతో వచ్చిన వారంతా తమ వాహనాలను అక్కడే నిలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా ట్రాఫిక్ జామ్ కలుగుతూ ఉండడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ని అడ్డుకున్నారు.అంతేకాకుండా ఈమె పైన పోలీస్ కేసు కోసం నమోదు చేశారు.
సాధారణ మహిళగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమెను ఇంతలా ఇబ్బంది పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటనే విషయనికి వస్తె.. ఇటివలె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమది ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడకు చెందిన ప్రాంతమని ఉపాధి కోసమే హైదరాబాద్ కు వచ్చామని తెలిపారు.. అయితే తమకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని.. తమకంటూ ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని తెలియజేసింది. ఈ విషయాన్ని చెప్పడంతో అటు హైదరాబాద్ పోలీసులను పిలిపించి రేవంత్ రెడ్డి.. చంద్రబాబు ఆదేశాల మేరకే ఈమె ఫుడ్ బిజినెస్ ని బంద్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి సీఎం జగన్ పేరు చెప్పగానే అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భయపడే విధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.. జగన్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందని చెప్పిన ఈ చిరు వ్యాపారి అయినా సాయికుమార్ మీద కూడా ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి చాలామంది ప్రజలు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులూ కూడా ఫైర్ అవుతున్నారు.