
ప్రకృతి యొక్క గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా జాతీయ పక్షి నెమలిని చూడాలి అంటే పట్టణవాసులు అందరూ కూడా జూపార్కు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. అక్కడ చెరలో బంధించి ఉన్న నెమలిని చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటారు. అదే పల్లెటూర్లలో అయితే ఉదయం లేచి చూసాము అంటే చాలు చుట్టుపక్కల చాలా చోట్ల ఇలాంటి నెమళ్లు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఈ నెమల్లు కొంతమందితో స్నేహం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి.
అయితే ఇక్కడ ఒక నెమలి ఇలాగే ఏకంగా మనుషులతో స్నేహం చేసింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే వరికోస్తున్న రైతులకు సహాయం చేయడానికి వచ్చింది నెమలి. ఒకవైపు రైతులు వరి కోత కోస్తూ ఉండగా అక్కడికి వచ్చిన నెమలి ఏకంగా అక్కడ ఉన్న పురుగులను తింటూ వారికి పురుగు పట్టకుండా పూర్తిగా క్లీన్ చేసేస్తూ ఉంది. సాధారణంగా అయితే నెమలి మనుషులను చూస్తేనే పారిపోతాయి. కానీ ఈ నెమలి మాత్రం వరి కోత సమయంలో ఇక రైతులకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఇక ఈ వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.