ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా మొబైల్ కి ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటారు అని అడిగితే ఇంట్లో ఉన్న కరెంటుతో చార్జింగ్ చేయడం చూస్తూ ఉంటాం. ఒకవేళ కరెంటు లేకపోతే పవర్ బ్యాంకు ను ఉపయోగించి మొబైల్ కు ఛార్జ్ చేస్తూ ఉంటాం. అయితే మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఇదే చేస్తూ ఉంటారు. కానీ ఏకంగా మొబైల్ ఫోన్ చార్జింగ్ బంగాళదుంపతో కూడా చేయవచ్చు అంటే నమ్ముతారా.. అదేంటి బంగాళదుంప ఏమైనా కరెంటు ట్రాన్స్ఫార్మరా.. బంగాళదుంపతో ఛార్జింగ్ ఎలా పెట్టుకోవచ్చు అంటారు ఎవరైనా.
అయితే బంగాళా దుంపతో కూడా ఎంతో ఈజీగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్న దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఐడియా తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎంతో మంది నమ్ముతూ ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం ఇది ఎంతవరకు నిజం అనే అనుమానం కూడా కలిగింది. బంగాళాదుంప ఒక సహజ ఎలక్ట్రోలైట్ అని అందరికీ తెలుసు. అంటే విద్యుత్ ప్రవాహం బంగాళదుంప ద్వారా సులభంగా ప్రయాణించగలదు. దీని ద్వారా మనం కూడా ఫోన్ చార్జింగ్ చేయగలమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఒక వ్యక్తి బంగాళదుంపను గిన్నెలో ఉంచి దానిపై కోకోకోలా పోసి ఇక బంగాళదుంప కు చార్జర్ పెట్టి ఫోన్ చార్జింగ్ చేయించుకుంటున్నట్లు వైరల్ గా మారిపోయిన వీడియో ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే రెండు కేబుల్ లను ఒక్కటే కేబుల్ గా చూపించే ప్రయత్నం చేశారు అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.