
అయితే ఇలా మనుషులు ఇతర జంతువులకు పాముల నుంచి ఎలా అయితే ప్రమాదం పొంచి ఉంటుందో ఇక పాములకు కూడా ఇలాగే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎప్పుడైనా జనాభాసాల్లోకి సర్పం వచ్చింది అంటే చాలు దానిని కొట్టి చంపడం లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. ఎక్కడ కాటు వేస్తుందో అనే ప్రాణ భయంతో ఇలా చేస్తూ ఉంటారు. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు కొన్ని జంతువులు కూడా ఏకంగా పాములపై దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో సింహం సింగిల్ గా వస్తుంది అనే రేంజ్ లో ఒక పాము సింగిల్ గా వచ్చింది. కానీ దాని చుట్టూ పదికి పైగా కుక్కలు చేరి ఏకంగా పాము పై దాడి చేశాయి. అయితే ఇన్నాళ్ల వరకు పాము ముంగిస కొట్లాడటం గురించి మాత్రమే మనం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూసాం. కానీ కుక్కలతో పాము పోట్లాడటం చూడటం చాలా అరుదు ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా కుక్కల గుంపు చుట్టుముట్టిన దారుణంగా దాడి చేస్తుంటే ఆ కుక్కలు అన్నిటిని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది పాము. కుక్కలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తుంటే పాము పడగ విప్పి దాడి చేసింది. సింహం లాగా సింగిల్గా పోరాటం చేసింది అని చెప్పాలి. ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.