అయితే ఇక వేటాడాలి అనుకున్న జంతువును వెంటాడి వెంటాడి మరి దారుణంగా వేటాడి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇలా సింహాల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఈ వీడియోలు చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎంతో చాకచక్యంగా వేటాడే సింహాలు ఇక ఇప్పుడు మనుషుల్లాగానే బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాయ్ అని తెలుస్తుంది. ఏకంగా కళ్ళముందు టార్గెట్ కనిపిస్తున్న కూడా పట్టించుకోలేదు.
ఏకంగా ఇలా మరో జంతువు దగ్గరికి వచ్చే వరకు కూడా వేచి చూసి ఎలాంటి కష్టం లేకుండానే ఆ జంతువుని వేటాడుతాయి. ఈ వీడియో చూసి నేటిజన్స్ కూడా షాక్ అవుతుంది. దారిలో ఎదురుపడిన చిన్న పందిని చూడగానే వెంటనే పక్కనే ఉన్న గడ్డిలోకి వెళ్లి దాక్కున్నాయి సింహాలు. పరిగెత్తే ఓపిక ఏమాత్రం లేదు అన్నట్లుగా ప్రవర్తించాయి. కానీ ఈ పందిని మాత్రం వదలొద్దు అనుకున్నాయ్. ఈ క్రమంలోనే ఆ పంది సమీపంలోకి వచ్చేంతవరకు కూడా ఆ గడ్డిలోనే దాక్కొని ఉన్నాయి. ఇక పంది తన ధ్యాసలో తాను సింహాలు సమీపంలోకి రాగానే గడ్డిలో నుంచి బయటికి ఒక్కసారిగా దూకిన సింహాలు ఆ చిన్ని పందిపై పంజా విసిరి వేటాడాయ్. ఇలా సింహాలు కూడా మనుషుల్లాగానే బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి వేటను కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాయి అని నెటిజెన్స్ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.