ఇటీవల ప్రపంచంలో కొత్త కొత్త వైరస్లు సైతం ప్రజలను కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొత్త వైరస్ల బారిన పడిన పక్షులు జంతువులు కూడా చాలా విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల బాతులు కోళ్లు ఇతర పక్షి జాతుల పై ప్రభావం చూపిస్తోంది. అయితే ఇది NH5N1 అనే వైరస్ వల్ల వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. భారత్లో కూడా గతంలో బర్డ్ ఫ్లూ చాలా కలకలం రేపింది ఎన్నో లక్షల సంఖ్యలో కోళ్లను కూడా ఈ వైరస్ వల్ల చంపేశారు కొన్నిచోట్ల ఒక్క రూపాయికి లేదా ఫ్రీగా ఇవ్వడానికి కూడా చాలామంది మక్కువ చూపారు.


దీంతో ఒక్కసారిగా కోళ్ల పరిశ్రమ యజమానుల పైన భారీగా నష్టపోయారు. ఇప్పుడు ఏపీలో కూడా పౌల్ట్రీ యాజమాన్యానికి మళ్ళీ పిడుగు లాంటి వార్త వినిపిస్తోంది. ఏపీలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలాన్ని రేపుతోంది. రెండేళ్ల క్రితం దేశంలో కరోనా మహమ్మారి ఒక ప్రళయం సృష్టించింది దీంతో చాలామంది ప్రజలు కూడా మరణించారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంతమేరకు కరోనా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా తరుణంలో ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఈ కొత్త వైరస్ కునుకు లేకుండా చేస్తోంది.


నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ వైరస్ కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాలలో చాలా కోళ్లు మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అక్కడ వైద్య అధికారులు కోళ్లను షాంపూలు తీసుకొని భోపాల్ ల్యాబ్ కు పంపించగా అక్కడ బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు మృతి చెందాయి అంటూ అధికారులు తెలియజేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ విషయం పైన పశువర్ధన శాఖ జిల్లా కలెక్టర్కు మాట్లాడుతూ ఈ వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మూడు నెలల పాటు ప్రజలు చికెన్ తినకపోవడమే మంచిదని చికెన్ షాపులను మూసివేయడమే మంచిదంటూ అధికారులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: