ఆనంద్ మహేంద్ర గారు హార్వార్డ్ యూనివర్సిటీలో చదువుకునేవారు.. అలా ఒకసారి ఆయన చదువుకొనే కళాశాలలో ఎస్సైన్మెంట్ కోసమని ఒక ఫిలిం షూట్ చేయడానికి ఇందౌర్ వెళ్లారు.. అక్కడ ఆనంద్ మహేంద్ర గారు మొదటిసారి ఒక 17 ఏళ్ల అమ్మాయిని చూశారట.. అయితే ఆ అమ్మాయిని చూడగానే తన ప్రేమలో పడిపోయారు ..ఆమె ఎవరో కాదు అనురాధ మహేంద్ర.. ఆమెను చూసిన రెండు మూడు రోజులకే ఆనంద్ తిరిగి హార్వర్డ్ కు వెళ్లిపోయారట.. అయితే ఆమెతో కొంత సమయాన్ని గడపాలని నిర్ణయించుకున్న ఆనంద్ మహేంద్ర.. అందుకోసం ఏకంగా ఒక సెమిస్టర్ పరీక్షను రాయకుండా ఆగిపోయారట.
అయితే అప్పట్లోనే ఇలాంటి నిర్ణయం చాలా కఠినమైనది కూడా చెప్పవచ్చు. అనురాధ ప్రేమలో ఆనంద్ మహేంద్ర మునిగిపోవడంతో.. తన అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో ఆమెకు సడన్గా ప్రపోజ్ చేశారు.. అలా వీరిద్దరి పెళ్లి 1985 జూన్ 17వ తేదీన పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్గా జరిగింది.. అనురాధ కేవలం ఆనంద మహేంద్ర గారి భార్య మాత్రమే కాకుండా ఆమె ప్రసిద్ధి గాంచిన లైఫ్ స్టైల్ మ్యాగ్జిన్ వ్యవస్థాపకురాలు కూడా.. ముంబైలో పుట్టిన అనురాధ ప్రతిష్టాత్మకమైన సోఫియా కాలేజీలో ఆమె తన విద్యభ్యాసాన్ని పూర్తిచేసింది.. వివాహమానంతరం ఈ దంపతులు బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి యూఎస్ఏ కి కూడా వెళ్లారు. అక్కడ అనురాధ మహేంద్ర బోస్టన్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ని పూర్తి చేశారట అనంతరం జర్నలిజం పబ్లిక్ సింగ్ లో కూడా తన కెరియర్ ని ప్రారంభించారు.