అయితే సాధారణంగా పానీపూరి ఎంత రేటు ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. మహా అయితే ఒక ప్లేట్ 20 రూపాయలు ఉంటుంది. ఒకవేళ పెద్దపెద్ద హోటల్ లోకి వెళ్లి పానీ పూరి తినాలి అనుకుంటే ఒక ప్లేట్ 50 రూపాయలు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే పానీపూరి ధర ఎంత ఉంటుంది అనే విషయంపై అటు సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే పానీపూరి గురించి అప్పుడప్పుడు కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే పానీపూరి కారణంగా కొన్ని అంటూ వ్యాధులు వస్తాయి అని తెలిసిన ఎంతోమంది దీనిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అయితే ఇప్పుడు వరకు ప్లేట్ పానీ పూరి ధరను మనం పదుల్లో చూసి ఉంటాం. కానీ ఇప్పుడు ప్లేస్ పానీపూరీ ధర ఎంతో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా నోరెళ్ళ పెడతారు. ఎందుకంటే ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో ప్లేట్ పానీపూరీ ధర ఏకంగా 333 రూపాయలు ఉంది. అయితే ఇది చూసి ఒక పారిశ్రామికవేత అవాక్కయ్యాడు. ఓ కంపెనీ సీఈవో కౌశిక్ స్నాక్స్ ధరలను చూసి ఆశ్చర్య వ్యక్తం చేశారు. ముంబై ఎయిర్పోర్ట్ లో ధరలు ఎక్కువ అని తెలుసు కానీ మరి ఇంతలా ఉంటాయని అస్సలు ఊహించలేదు. అయితే ఇక అతను షేర్ చేసిన ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు.