కార్ రివర్స్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కొండపై నుంచి లోయలో పడి యువతి దుర్మరణం చెందినట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అసలు విషయంలోకి వెళ్తే ఈ ఘటన మహారాష్ట్ర ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్కడ ఉన్న సాక్షి లను సైతం పోలీసులు విచారించి మరి సమాచారాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది.


శ్వేతా దీపక్ పూర్వసే.. సూరజ్ సంజాములే, ఇద్దరు స్నేహితులు కూడా సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్ నుంచి సులిభంజన్ హిల్స్ కు వెళ్లారట. అయితే ఈ వీడియోలో శ్వేతా దీపక్ సూర్వసే.. కారు డ్రైవర్ సీట్ లో కూర్చొని కారుని నెమ్మదిగా రివర్స్ చేస్తున్నట్లుగా మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నది. ఆమె స్నేహితుడు సూరజ్ సంజాములే.. మాత్రం ఆమెకు కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోని రికార్డు చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే శ్వేత కారును నెమ్మదిగా వెనక్కి తిప్పడం మాత్రం ఈ వీడియోలో మనం గమనించుకోవచ్చు.. అలా ఆమె కారులో నుంచి 50 మీటర్ల దూరం వరకు బ్యాకప్ వెళ్లడం జరిగింది.


అయితే ఒక్కసారిగా కారు అదుపు వేగం పెంచడంతో ఆమే స్నేహితుడు సూరజ్ కూడా నెమ్మదిగా చేయమని పదేపదే హెచ్చరిస్తున్న కూడా కారు ఇంజన్ రివర్స్ అవుతూ ఉండగా క్లచ్ క్లచ్ తొక్కమని అరుస్తున్నప్పటికీ కారు బ్రేక్ వేసేందుకు సూరజ్ పరిగెత్తడం కూడా ఈ వీడియోలో మనం గమనించవచ్చు. కానీ అప్పటికే ఆమె ప్రమాదం అంచుల వరకు కారు తీసుకువెళ్ళింది. ఒక్కసారిగా 300 అడుగు ఎత్తున ఉన్న కొండపై నుంచి లోయలో పడి నుజ్జు నుజ్జు అయిపోయింది. దీంతో శ్వేత అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కనిపిస్తోంది. అయితే వీరు అక్కడ దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లినట్లు సమాచారం. అలాగే కొండల పైన ఉన్న సుదూరమైన దృశ్యాలను చూడడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి పర్యటలు వస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: