తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో అజిత్ కుమార్ చాలా ప్రత్యేకం. ఇప్పటికీ సొంతంగా ఫోన్ కూడా ఉపయోగించని ఏకైక టాప్ హీరో.సోషల్ మీడియా ప్రపంచానికి చాలా దూరంగా ఉంటూ.. తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ తన లైఫ్ అంతా తనకు నచ్చినట్టుగా ప్రశాంతంగా గడుపుతున్నాడు. అలాగే ఇటు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో కూడా అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది తునీవు సినిమాతో పలకరించిన అజిత్… ఇప్పుడు విదాముయర్చి మూవీలో నటిస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం అజిత్ తన ప్రాణాలనే ఫణంగా పెడుతున్నాడు. గతంలో విదాముయర్చి యాక్షన్ సీన్ కోసం స్వయంగా కారుని నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అజిత్ కుమార్ నడిపిన కారు ఏకంగా గాల్లో మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో స్వల్పగాయాలతో వారు బయటపడ్డారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ మూవీ కోసం అజిత్ తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు.ఇక ఇప్పుడు మరోసారి విదాముయర్చి యాక్షన్ సీన్ షూటింగ్ వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. 


ఆ వీడియోలో కారును ఏకంగా క్రేన్ తో గాల్లోకి లేపారు. ఆ కారు గాల్లో ఉన్నప్పుడు అందులో హీరో అజిత్ తో పాటు.. మరో నటుడు అయిన ఆరవ్ కూడా ఉన్నారు. క్రేన్ సాయంతో ఆ కారుని గాల్లోకి లేపిన తర్వాత అక్కడే కొన్ని పల్టీలు కొట్టించారు. ఆ సమయంలో కూడా ఇద్దరూ స్టార్స్ కార్లోనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. అందులో కూడా స్టార్ హీరో ఎలాంటి డూప్ సాయం లేకుండా అదే కారులో ఉండడం చూసి చూసి షాకవుతున్నారు అజిత్ ఫ్యాన్స్. విదాముయర్చి సినిమా కోసం అజిత్ చేసే స్టంట్స్ చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు అజిత్ ఫ్యాన్స్. ఒక సినిమా కోసం ప్రాణమివ్వడమంటే ఇదే.. అజిత్ అందుకే నీకు అంతగా తమిళనాటా అభిమానులు ఉన్నారు.. నువ్వు రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు తలా ఫ్యాన్స్.యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో అజిత్, ఆరవ్ తోపాటు త్రిష, రెజీనా ఇంకా అర్జున్ సర్జా నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు.. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను కూడా స్టార్ట్ చేశాడు అజిత్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: