Viral Video: సిగిరెట్ తాగే వ్యక్తి లంగ్స్ బయటకి తీసిన డాక్టర్స్.. ఇంత దారుణంగా ఉంటాయా?


  డాక్టర్ చెన్ జింగ్‌కియు సీనియర్ సర్జన్ ఇంకా అలాగే నాన్జింగ్ మెడికల్ యూనివర్శిటీలోని ఊపిరితిత్తుల మార్పిడి కేంద్రం చైనాలోని తూర్పు షాంఘై ప్రావిన్స్‌లోని వుక్సీ సిటీలో ఉంది.అతను ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో బాగా అనుభవం ఉన్న నిపుణుడు.ఇటీవల, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని అవయవ దానం కోసం అతని వద్దకు పంపడం జరిగింది. 52 ఏళ్ల బ్రెయిన్ డెడ్ వ్యక్తి యొక్క అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు, అయితే అతని అవయవాలను స్వీకరించిన వైద్యులకు షాకింగ్ దృశ్యం కనిపిచింది. అది చూస్తే ఖచ్చితంగా కళ్ళు భైర్లు కమ్ముతాయి.అంటే ఆ అవయవ దాత యొక్క ఊపిరితిత్తులు నలుపు రంగు, దుమ్ము, ఎంఫిసెమా ఇంకా క్షయ సంకేతాలతో చాలా దారుణంగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన వైద్య బృందం.. రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున.. గత 30 ఏళ్ల నుంచి సిగరెట్ తాగేవారి పరిస్థితి ఇదేనని పేర్కొంది.


భయంతో మన గుండెని కదిలించే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ధూమపానం చేసేవారు దీనిని చూసి ఖచ్చితంగా అలవాటు మార్చుకోవాలని ఈ వీడియో షేర్ చేశారు. కాబట్టి మీకు ఈ అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకొండి. ధూమపానం చేసేవారి ఊపిరితిత్తుల పరిస్థితే ఇలా ఉంటే.. పక్కనే నిల్చుని వేరే మార్గం లేకుండా పొగ వాసన పీల్చే వారికి కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. అందువల్ల, మిమ్మల్ని మీరు ఇంత దారుణాతి దారుణంగా మార్చుకోవడం ఎంత నరకమో గుర్తుంచుకొని.. దూమ పానం లాంటి చెడు అలావాటును ఖచ్చితంగా మానేయండి. లేదంటే మీ లంగ్స్ కూడా ఇంత దారుణాతి దారుణంగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది.కాబట్టి మీకు సిగిరెట్ అలవాటు ఉంటే ఖచ్చితంగా దాన్ని తగ్గించుకోండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: