ఒకప్పుడు యువత జీవితంలో పైకి రావాలని ఆశయం పెట్టుకునే చాలా కష్టపడే వారు. కానీ ఈ కాలంలో యువత మారిపోయారు. వారిని యువత అనే బదులు నిబ్బా నిబ్బీలు అనడం సమంజసం. ఎందుకంటే పనికొచ్చే పనులు చెయ్యకుండా సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఒక గోల్ గా పెట్టుకున్నారు. లైకులు, వ్యూస్ రాబట్టేందుకు ఎలా పడితే అడ్డు అదుపు లేకుండా వింత వీడియోలు తీసి పెడతారు.కానీ, అలా చేస్తే కొన్నిసార్లు ఖచ్చితంగా ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇలాంటి ఘటనే ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. ఓ నిబ్బీ యువతి, ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో సిగ్గులేకుండా సిగరెట్ తాగుతూ రీల్స్ వీడియో తీసింది. అసలు ధూమపానం అలవాటు లేకున్నా కూడా కేవలం లైకుల కోసమే ఆమె ఇలా చేసింది. కానీ, ఆ వీడియో బాగా వైరల్ అవుతుందని ఆమె ఊహించలేదు.అయితే ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ వీడియోనే కనిపిస్తోంది. 


ఇక అంతలోనే మరో వీడియో బయటకు వచ్చింది. అందులో ఆ అమ్మాయిని ఆమె తండ్రి బెల్టుతో చితక కొడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఆ వీడియో క్లియర్‌గా లేకున్నా, అమ్మాయి కేకలు మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ బాలిక నేలపై పడి దెబ్బలు తాళలేక కొట్టొద్దని బతిమిలాడుతున్నట్లు ఆ వీడియో చూడవచ్చు. ఈ రెండో వీడియో వల్ల మొదటి వీడియో వివాదం ఇంకా చాలా పెద్దది అయ్యింది.ఈ సంఘటన వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఓ వ్యక్తి ఈ వీడియోను ఎక్స్‌ ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతుంది. దీనిని 3 లక్షలకి పై మంది చూశారు. ఈ వీడియోకి ఎన్నో కామెంట్లు వచ్చాయి. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఇలాంటి చెడు పనులు చేసేవారిని కఠినంగా శిక్ష ఉండాలని, తండ్రి చేసిందే మంచిదని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది అయితే మాత్రం ఆ అమ్మాయికి మద్ధతు తెలుపుతున్నారు. అది శిక్ష కాదు, హింస అని, దాని వల్ల ఆ అమ్మాయి మరింత కోపంగా ఎదురు తిరగ గలదని వారు వాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: