Viral Video: పబ్లిక్ లో స్త్రీని కుక్కల కొట్టిన రౌడీ! మమతాబెనర్జీ ఇదేనా నీ పాలన?   

పశ్చిమ బెంగాల్ లో మహా దారుణం చోటు చేసుకుంది. జనం చుట్టూ గుమిగూడి చూస్తుండగా ఓ స్త్రీని ఒక రౌడీ వెధవ దారుణంగా కొట్టాడు. అలాగే మరో వ్యక్తిపై కూడా అక్కడున్న వారు దాడి చేశారు.ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో 'వీధి తీర్పు'పై నెట్టింటా విమర్శలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని చోప్రాలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. కొంతమంది జనం సినిమా చూస్తున్నట్లు గుంపుగా చూట్టూ చేరారు. ఆ రౌడీ వెధవ కర్రల కట్టతో మహిళను పదేపదే కొట్టాడు. దీంతో బాధతో ఆమె ఎంతగానో అరిచింది. అయినప్పటికీ ఆ రౌడీ కొట్టడం ఆపలేదు. కింద కూర్చొన్న వ్యక్తిని కూడా వాడు కొట్టాడు. గుంపులోని వెధవలంతా కూడా కళ్లప్పగించి దీనిని చూశారు కానీ దాడిని ఆపడానికి ప్రయత్నించకపోగా కొట్టిన వ్యక్తికి అండగా నిలిచారు. మరో రౌడీ వెధవ కూడా ఆ మహిళ జట్టుపట్టుకుని కాళ్లతో తన్నాడు. 


అయితే ఆ మహిళ, ఒక వ్యక్తిని బహిరంగంగా ఎందుకు కొట్టారో అన్న విషయం తెలియలేదు.అయితే ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇది జరిగింది బెంగాల్ లో కాబట్టి ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ, సీపీఎం మండిపడ్డాయి. ' వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనకు సంబంధించిన వికృత రూపం ఇది. ఒక మహిళను ఎంతో దారుణంగా నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఆ వీడియోలోని రౌడీ వెధవ జేసీబీగా పాపురల్‌ అయిన తాజెముల్. 'ఇన్సాఫ్' ద్వారా సత్వర న్యాయం అందిస్తాడట. వీడు అక్కడ ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్‌కు సన్నిహితుడు' అని బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జ్‌ అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఆరోపించారు.అలాగే మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ మహ్మద్‌ సలీం కూడా ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై దారుణంగా మండిపడ్డారు. ఇది దారుణంగా ఉందని విమర్శించారు. అయితే ఈ సంఘటనపై టీఎంసీ ఇంకా స్పందించలేదు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: