ప్రపంచవ్యాప్తంగా తన డాన్స్ తోనే మైమరిపించిన మైఖేల్ జాక్సన్  గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా తన శరీర కదలికతోనే క్లాస్ డాన్స్ తో మెప్పిస్తు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న డాన్సర్ గా పాప్ స్టార్ గా కూడా పేరు పొందారు.మైఖేల్ జాక్సన్ మరణించి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక విస్తీ పోయే నిజం బయటికి వచ్చింది.. అదేమిటంటే అతడికి అప్పులు చాలా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.



మైఖేల్ జాక్సన్ కు ఏకంగా రూ .3700 కోట్ల రూపాయల అప్పు ఉందని తెలిసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.. మైకేల్ జాక్సన్ మరణానికి ముందే అప్పుల్లో మునిగిపోయారని ప్రముఖ హాలీవుడ్ మీడియాలో కథలుగా వార్తలు వినిపిస్తున్నాయి.. 2009లో మైఖేల్ జాక్సన్ మరణించారు. ఒక ప్రముఖ న్యూస్ నివేదిక అందించిన ప్రకారం ఈ పాప్ గాయకుడు ఎస్టేట్ కార్య నిర్వాహకులు సైతం.. ఇటీవలే లాస్ ఏంజెల్స్ కౌంటి సుపీరియర్ కోర్టులో సైతం పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో వీరు  మైఖేల్ జాక్సన్  రుణాన్ని ఎదుర్కొన్నారని తెలియజేశారు. 500 మిలియన్ల డాలర్ల కంటే ఎక్కువగా అప్పులు ఉన్నాయని తెలియజేశారు.


దీని విలువ ఇండియన్ కరెన్సీ ప్రకారం 3700 కోట్లు అని తెలుస్తోంది..మైఖేల్ జాక్సన్ మరణించిన సమయంలో జాక్షన్ అత్యంత విలువైన తన ఆస్తులను 500 మిలియన్లకు పైగా అప్పులు చేశారని మరికొన్ని అధిక వడ్డీరేట్లకు తీసుకొని వడ్డీలు చెల్లించారని కొన్ని అప్పులు డిఫాల్ట్ లో ఉన్నాయని పిటిషన్లు తెలియజేయడం జరిగింది..మైఖేల్ జాక్సన్ కు ముగ్గురు పిల్లలని.. పారిస్, ప్రిన్స్, బిగి.. ముఖ్యంగా ఇతడి తల్లి కేథరిన్ వంటి వారు
 మైఖేల్ జాక్సన్ ట్రస్ట్ నుంచి ఎలాంటి నిధులు పొందలేరని వార్తలు కూడా వినిపించాయి.మైఖేల్ జాక్సన్ IRS మధ్య వివాదం పరిష్కరిస్తేనే వారి డబ్బులు తీసుకొనే వెలుసుబాటు సైతం చేశారు. కానీ మైఖేల్ జాక్సన్ కుటుంబ సభ్యులు మాత్రం తాము ఇప్పటికి భత్యం ద్వారా చెల్లింపులు పొందుతున్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కోర్టు కూడా మైఖేల్ జాక్సన్ కుటుంబానికి గణనీయంగానే పెద్ద మొత్తంలో డబ్బులు అందజేస్తున్నామంటూ ప్రకటించింది. మైకేల్ జాక్సన్ ఎస్టేట్ తమ పిల్లలకు చాలా సంబంధాన్ని కలిగి ఉంటుందని వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా వారి బాగోగులు చూసుకునేలా పక్కా ప్రణాళికతోనే రూపొందించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: