Viral Video: మొసలి, అనకొండ మధ్య ఫైట్? ఏది గెలిచిందంటే? 

కొండ చిలువలు, మొసళ్లు రెండూ కూడా చాలా భయంకరమైన జీవులు. అలాగే రెండూ కూడా చాలా శక్తివంతమైనవనే విషయం అందరికీ తెలిసిందే. ఇక నీటిలో ఉన్న మొసలికి ఒక్కసారి దొరికితే.. ఇక ఎంత గించుకున్నా కూడా అసలు తప్పించుకనే అవకాశమే ఉండదు.ఎంత పెద్ద జంతువైనా కూడా దాని ఆకలికి ఆహారమైపోవాల్సిందే. ఇంకా అలాగే కొండచిలువ వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. దానికి చిక్కిన వేటను ఒక్కసారిగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి దెబ్బకు ప్రాణాలు తీసేస్తుంది. అందుకే దీని జోలికి వెళ్లేందుకు ఏ జంతువూ కూడా సాహసించదు. అయితే ఈ రెండింటి మధ్య అప్పుడప్పుడూ పోరాటం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం అనేది జరిగింది. అయితే చివరకు ఏం జరిగిందో ఏది గెలిచిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో  తెగ వైరల్ అవుతోంది.అందులో మొసలి, కొండచిలువలు సడన్‌గా తారసపడతాయి. అప్పటికే ఆకలితో ఉన్న మొసలి.. కొండచిలువను ఫాస్ట్ గా ఎటాక్ చేస్తుంది. అయితే తానేమీ తక్కువ కాదన్నట్లు కొండచిలువ కూడా మొసలితో భీకర పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో రెండింటి మధ్య కూడా ఎంతో భయంకర పోరు జరుగుతుంది. ఆ కొండచిలువను కొరికి చంపేయాలని ఆ మొసలి ప్రయత్నిస్తుంది. దీంతో చివరకు కొండచిలువ.. మొసలిని మొత్తం గట్టిగా చుట్టేసి దానికి ఇక ఊపిరాడకుండా చేస్తుంది.దెబ్బకు ఆ మొసలికి చుక్కలు కనిపిస్తాయి. ''వామ్మో.. ఈ కొండచిలువను చంపడం మామూలు విషయం కాదు  బాబోయ్''.. అనుకున్నట్లుగా.. ఇక దాన్ని వెంటనే వదిలేస్తుంది. దీంతో ఆ కొండ చిలువు.. ''ఇంకోసారి నాతో పెట్టుకుంటే.. నీ ప్రాణాలు తీసేస్తా''.. అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: