సాధారణంగా జర్నలిస్టులు ఎక్కడ ఏం జరిగినా కూడా అక్కడికి పరుగులు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది మైక్ పట్టుకొని ఇక అక్కడ జరుగుతున్న పరిస్థితులను వివరిస్తూ లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది జర్నలిస్టులు ఏకంగా ప్రమాదకరమైన ప్రాంతాలకు కూడా వెళ్లి ఇలా లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఇలా రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో ప్రమాదాలకు కూడా గురవుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలాంటి తరహా వీడియోలు అటు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గా మారిపోతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాగే ఒక మహిళా జర్నలిస్టుకు ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా మహిళ ఎంతో ఓపికతో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా ఆమెను వెనుక నుంచి వచ్చిన ఒక ఎద్దు కుమ్మేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వింతైన ఘటన పాకిస్తాన్లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఎద్దుల జంట ధరపై  స్థానిక వ్యాపారులతో మహిళ జర్నలిస్టు మాట్లాడుతూ.. లైవ్లో రిపోర్టింగ్ చేస్తూ ఉండగా.. ఆమెపై ఒక ఎద్దు వెనక నుండి దాడి చేసింది.


 ఇలా అకస్మాత్తుగా ఎద్దు దాడి చేయడంతో రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్టు అల్లంత దూరాన ఎగిరి పడింది. అయితే ఈ వీడియోకి ఏకంగా మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి అని చెప్పాలి. ఇది సరిగ్గా ఎక్కడ జరిగింది అన్న విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. వ్యాపారులు ఎద్దుల జంటలను ఐదు లక్షల కంటే తక్కువకు అమ్మేందుకు సిద్ధంగా లేరని.. ఇక అక్కడ ఉన్న వ్యాపారులను అడిగి ఆమె లైవ్ రిపోర్టింగ్ చెబుతుండగా.. వెనకనుంచి వచ్చిన ఒక ఎద్దు అకస్మాత్తుగా ఆమెపై దాడి చేసి కుమ్మిపడేసింది. ఇక ఆమెకేకలు వేస్తూ అంత దూరాన పడటంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమెను వెంటనే పైనకి లేపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: