సోషల్ మీడియాలో వికృతి చేష్టలు రోజురోజుకి అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి.. ముఖ్యంగా మహిళలు అమ్మాయిలని టార్గెట్ చేస్తూ కొంత మంది చాలా దారుణంగా ట్రోల్స్  చేస్తూ ఉన్నారు.. కొంతమందిని అందంగా లేవని మరి కొంతమంది పొట్టిగా ఉన్నావని మరి కొంతమంది బాడీ షేమింగ్లకు పాల్పడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి దారుణమైన ట్రోలింగ్ రోజురోజుకీ పెరుగుతూ ఉండడంతో చాలామంది వీటి పైన తగిన యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఈ ట్రోలింగ్ భూతాలను తట్టుకోలేక చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు.


ఇప్పుడు తాజాగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతీయ సైనికుడు అంశుమాన్ సింగ్ త్యాగానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం సైతం కీర్తి చక్ర అవార్డును కూడా ప్రకటించడం జరిగింది.. ఈ క్రమంలోనే ఇటీవలే ఆయన భార్య రాష్ట్రపతి చేతులు మీదుగా స్మృతి అవార్డును సైతం తీసుకోవడానికి వచ్చారు.. ఆమె తన భర్తను సైతం తలుచుకుంటూ ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా చాలా బరువైన మనసుతో ఈ అవార్డును సైతం స్వీకరించినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. కానీ ఈ వీడియో పైన కూడా ట్రోలర్లు సైతం రెచ్చిపోయి మరి ఆమె పైన కామెంట్స్ చేస్తున్నారు.


సదరు మహిళ ఎంతో అందంగా ఉందని ఆమె అందానికి ఫిదా అవుతున్నామంటూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు.. ఒక నీచుడైతే ఏకంగా ఆమెను వదలను అంటూ అసభ్యకరమైన కామెంట్లు కూడా.. ఈ ఘటన ఇప్పుడు దేశం మొత్తం దుమారాన్ని రేపేల చేస్తున్నది. ఈ విషయం పైన జాతీయ మహిళా కమిషన్ కూడా ఒకసారిగా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతానికి అతనిపైన కేసు నమోదు అయితే అయ్యింది. కానీ దేశాన్ని కాపాడిన ఒక అమరవీరుడి భార్యను ఇలాంటి దారుణంగా రోల్ చేయడం సమాజానికే సిగ్గుచేటు అంటూ కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.. రోజు రోజుకూ సోషల్ మీడియా ఇంత దిగజారి పోతోంది అంటూ కూడా మరి కొంతమంది నేటిజన్స్ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: