అయితే కొంతమంది మాత్రం ఏకంగా పనిగట్టుకుని జంతువులను హింసించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. గతంలో ఏనుగు తినే ఆహారంలో బాంబు పెట్టిన ఘటన ఇక దేశవ్యాప్తంగా ఎంత సంచలనగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. ఇక ఈ వీడియో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పనికి జంతు ప్రేమికులందరూ కూడా అగ్గి మీద గుగ్గిలం లాగా మండిపోతున్నారు.
సాధారణం గా ఎంతో మంది పర్యాటకులు హిప్పో పొటామస్ కు ఆహారం అందించడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా పర్యటకులు వచ్చినప్పుడు హిప్పో తనకు ఏదైనా ఆహారం ఇస్తారేమో అని ఎంతో ఆశగా నోరు తెరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పర్యటకుడు హిప్పోకి ఆహారం వేస్తాను అని ఆశ చూపి ఏకంగా నోట్లో ప్లాస్టిక్ కవర్ వేశాడు. ఒక వ్యక్తి ఏకంగా క్యారెట్ ను హిపోపోటమస్ కు తినిపించేందుకు ప్రయత్నించగా. అదే కారులో ఉన్న మరో వ్యక్తి హిప్పోపోటమస్ నోరు తెరవగానే ప్లాస్టిక్ కవర్ దాని నోట్లో వేయగా ఆహారం అనుకొని అది నమిలి మింగేసింది. వీళ్లకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్స్ అందరు కూడా షాక్ అవుతారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.