తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటారు. తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తిశ్రద్ధలతో నడుచుకుంటూ ఉంటారు.అటువంటి కొండపైన కొంతమంది భక్తితో నడుచుకోవాల్సింది పోయి చాలా ఆకతాయి పనులు వెక్కిలి చేష్టలు చేస్తూ ఉన్నారు. తిరుమలలో కొంతమంది తమిళ యూట్యూబర్స్ రెచ్చిపోయి మరి శ్రీవారి భక్తుల మనోభావాలను సైతం కించపరిచేలా చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అందుకు సంబంధించి ఫ్రాంక్ వీడియోలతో అక్కడ భక్తులను కూడా ఎగతాళి చేసినట్లు సమాచారం.


ఈ మధ్యకాలంలో ఫ్రాంక్ వీడియోల సంఖ్య పెరిగిపోయింది. అంతేకాకుండా ఇలా చేసి కొంతమంది వారి యొక్క పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. తాగాక తిరుమలలో అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. కొందరు తమిళ యూట్యూబర్స్ శ్రీవారి భక్తులను హేళన చేయడం జరిగిందట. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులను సైతం కొంతమంది ఆకతాయిలు ఫ్రాంక్ చేశారు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు ముందు యూట్యూబర్స్ కాస్త వెహికల్ చేష్టలు చేసినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


టిటిఎఫ్ వాసన్ అనే ఒక తమిళ్ యూట్యూబర్ అతడి వెక్కిలి బ్యాచ్తో కలిసి.. నిజంగానే గేటుకి తాళాలు తీస్తున్నారేమో అని అంతగా భావించేలా అక్కడ ఉన్న భక్తులను లేచి నిలబడేలా చేసి.. వారు లేవగానే ఆ ఆకతాయిలు వెకిలిగా నవ్వుతూ అక్కడ నుంచి పరుగులు తీసినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా కోతి చేష్టలు చేసిన బ్యాచ్ రచ్చఅంతా కాదట.. భక్తులు మనోభావాలను సైతం ఆడుకోవడమే కాకుండా ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం పైన శ్రీవారి భక్తులు సైతం కాస్త ఆగ్రహానికి గురవుతున్నారు. వారిని వదిలేయకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కఠినంగా శిక్షించాలంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి టిటిడి వారి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: