సాధారణంగా ఎద్దులు, ఆవులు లాంటి వాళ్ళని సాధు జీవులు అని అంటూ ఉంటారు. కానీ వాటికి కోపం వస్తే మాత్రం సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో అయితే ఏకంగా మనుషులను చూస్తే శత్రువులను చూసినట్లుగానే ఇలా ఎన్నో ఎద్దులు ప్రవర్తిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దారుణంగా మనుషులపై దాడులు చేస్తూ కుల్లబొడుస్తూ ఉన్న ఘటనలు ఎన్నో అందరిలో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా జనావాసాలలో రెండు ఎద్దుల మధ్య హోరాహోరీ కొట్లాట జరగడం లాంటి వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 అయితే ఇలా రెండు ఎద్దులు ఏకంగా పోట్లాడుకుంటున్న సమయంలో మధ్యలో ఎవరైనా వెళ్లారు అంటే ఇక వారి ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే మధ్యలో వెళ్లి విడిపించడానికి ప్రయత్నించిన జంతువులు, మనుషులపై కూడా ఆ ఎద్దులు దాడికి పాల్పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్న సమయంలో ఎవరూ మధ్యలో వెళ్లడానికి అసలు ప్రయత్నించరు. అయితే ఇక్కడ మాత్రం ఒక కుక్క ఎద్దుల పంచాయతీని తెగ్గొట్టేసింది. జనావాసాల మధ్య రోడ్డుపై రెండు ఎద్దులు హోరాహోరీగా పోట్లాడుకుంటూ ఉన్నాయి.


 ఇలాంటి సమయంలో చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ కూడా భయపడి పోయి దూరంగా జరిగారు. ఇక అక్కడ ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కడే ఉన్న ఒక కుక్క ఎద్దుల పంచాయితీని తెగ్గొట్టేందుకు వచ్చింది. ఏకంగా ఊకో అన్న.. గీ కొట్లాట ఏంది అన్నట్లుగానే ఆ రెండిటిని విడగొట్టింది. అయితే విడగొట్టిన తర్వాత మళ్ళీ పోట్లాడుకునేందుకు వెళుతున్న సమయంలో కూడా కుక్క ఆ రెండింటిని కూడా మొరుగుతూ హెచ్చరించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసి ఆ కుక్క ధైర్యానికి నేటిజన్స్ షాక్ అవుతున్నారు  భారీ ఆకారంలో ఎద్దులను చూసి కూడా కుక్క భయపడలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: