అడవికి రారాజు అయిన సింహం ఆకలేసిందంటే ఏ జంతువునైనా సరే దారుణంగా వేటాడేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆకలిగా ఉన్న సింహానికి ఏ జంతువైన చిక్కింది అంటే ఆ జంతువుకు అదే చివరి రోజు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సింహం వేట ఎంత వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటుంది అన్నది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే ఎన్నో వీడియోల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఆకలిగా ఉన్న సింహం వేట ప్రారంభించిన తర్వాత దానికి చిక్కకుండా పారిపోవాలి అనుకున్న ప్రయత్నం కూడా వృధాప్రాయాసే అవుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇలాంటి తరహా ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. సఫారీ టూర్కు వెళ్ళిన కొందరు పర్యాటకులు చిత్రించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. సాధారణంగా కొన్ని కొన్ని సార్లు సింహాలను హైనాలు గుంపుగా వచ్చి భయపెడుతూ ఉంటాయి. అదే హైనా ఒంటరిగా చిక్కితే సింహం ఒక్క పంజాతో ప్రాణం తీసేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ రెండు సింహాల కంటికి ఒక హైనా కనిపించింది. దీంతో తనకు అదే చివరి రోజు అని ముందే హైనా గ్రహించేసింది. దీంతో ఆ రెండు సింహాలకు సరెండర్ అయిపోయింది.



 ఇంతకీ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే.. ఏకంగా రెండు సింహాలు రోడ్డు పక్కన ఉండక అటువైపుగా ఒక ముసలి హైనా వచ్చింది. ఆశ్చర్యకరంగా ఆ హైనా  ప్రాణాలను కాపాడుకునేందుకు ఎక్కడ ప్రయత్నించలేదు. సింహాలను చూసి అలాగే నిలుచుని ఉండిపోయింది. అంటే ఇక తన ప్రాణం పోయింది. ఇదే తనకు లాస్ట్ డే అన్న విషయాన్ని అర్థం చేసుకుంది హైనా. దీంతో ఆ సింహాలు హైనాను పట్టుకొని చంపేస్తున్న అది మాత్రం ఎక్కడా ప్రతిఘటించలేదు. సింహాలు దాడి చేసిన సమయంలో కూడా హైనాలు ఎంతో బలంగా ప్రతికటించి పోరాడగలవు. అలాంటి హైనా పోరాడకుండా ఇక సింహాలకు సరెండర్ అయిపోయింది. ఇక ఈ వీడియో చూసి నెటిజెన్స్  సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: