
ఇక ట్విట్టర్లో 8.6 మిలియన్ల మంది ఫేస్ బుక్ లో 27 మిలియన్ల మంది ఫాలోవర్స్ ని మాత్రమే కలిగి ఉన్నారు ధోని. ఇక ఎక్కువగా సర్చింగ్ చేసే ప్రముఖులలో ధోని కూడా నిలవడం గమనార్హం. ధోని చేసిన ఏ పోస్ట్ అయినా సరే క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటుంది.. అయితే ధోని తన సోషల్ మీడియాలో కేవలం నలుగురిని మాత్రమే ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. అలాగే ట్విట్టర్ ఖాతాలో 33 మంది ప్రముఖులను మాత్రమే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇన్స్ట యాప్లో తన భార్య సాక్షి సింగ్ తో పాటు, కుమార్తె జీవా సింగ్ ధోని, ఇజ ఫార్మ్స్ అనే వ్యవసాయ ఖాతాను.. అలాగే బాలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరు పొందిన అమితాబచ్చన్ ని మాత్రమే ధోని ఫాలో అవుతున్నారు. ధోని తన సన్నిహితులను లేదా ఇండియన్ క్రికెట్ ఆటగాళ్లను కూడా ఫాలో కావడం లేదు. ఇటీవలే దోని అనంత్ -రాధిక వెడ్డింగ్ ఈవెంట్ లో కనిపించడం జరిగింది. అక్కడ టాలీవుడ్ హీరో మహేష్ బాబు తో కలిసి కూడా ఫోటోలు దిగినట్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ధోనికి సంబంధించి సరికొత్త లుక్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.