దీన్నిబట్టి చేస్తే మనం ఎప్పుడు కొన్నా కూడా పది రోజులు అన్నట్టుగా అది చూపిస్తుంది.. వాస్తవానికి అయితే ఎప్పుడు తయారుచేసిన రోజు నుంచి ఎక్స్ పర్ డేట్ వరకు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలు పెరుగు మజ్జిగ వంటివి కేవలం రెండు రోజులకు మించి బాగుండవనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా విషయంలో మాత్రం ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అక్కడ ఏదైనా తేడా వస్తే అక్కడ ప్రభుత్వాలు అసలు అంగీకరించవట.
ముఖ్యంగా కోడిగుడ్లు మన ఇండియాలో నెలలు తరబడి ఉంటాయి.. సౌదీ అరేబియాలో కొంత మంది తెలుగువారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన తర్వాత కోడిగుడ్డు పైన ఎక్స్పైర్ డేట్ ఉన్నటువంటి షిల్ ని సైతం షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్.. ఎక్స్పైరి డేట్ రెండు ఉంటాయంటూ అందుకు సంబంధించిన విజువల్స్ ని కూడా హైలెట్ చేస్తున్నారు. కానీ మన ఇండియాలో మాత్రం ఇలాంటివి ఎందుకు చేయడం లేదని అక్కడ ఉన్న తెలుగువారు అడుగుతున్నారు. 3-5-2024 నుంచి..29-8-2024 ఎక్స్ పర్ డేటు ఉన్నదట.. అంటే సుమారుగా మూడు నెలల పాటు కోడిగుడ్డుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందట. ఇది వాళ్ళ లెక్క..