భారత్లో గడచిన మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ వల్ల ఒక్కసారిగా ప్రపంచం అతలాకుతలమయ్యింది.. ఈ వైరస్ కారణంగా చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోవడమే కాకుండా కొంతమంది జీవితాలు తలకిందులయ్యాయి.. ఇలాంటి భయంకరమైన మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ బయటపడుతున్న తరుణంలో ఇప్పుడు తాజాగా మరొక కొత్త వైరస్ వ్యాప్తి చెందడంతో ఒకసారిగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వాటి గురించి పూర్తిగా ఇప్పుడు ఒకసారి చూద్దాం.


గుజరాత్ లో చండిపురా అనేటువంటి కొత్త వైరస్ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.. ఈ వైరస్ కేవలం చిన్నపిల్లల పైన చాలా ప్రభావం చూపిస్తోంది అంటూ తెలుపుతున్నారు. కేవలం కొన్ని రోజులలోనే ఈ వైరస్ ఆరుగురు పిల్లల మరణానికి కారణమయ్యిందంటూ తెలియజేస్తున్నారు.. అయితే వైద్యులు తెలుపుతున్న సమాచారం ప్రకారం ఈ వైరస్ మొదట జ్వరంగా ఉంటుందని.. ఈ వైరస్ రావడానికి ముఖ్య కారణం ఈగలు దోమలు వంటి కీటకాల వల్ల వ్యాప్తి చెందుతుంది అంటూ తెలియజేస్తున్నారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందిన పిల్లలు మెదడు పైన చాలా ప్రభావం చూపిస్తుందట.


మెదడు మొత్తం వాపు రావడమే కాకుండా రోజురోజుకి వీరి పరిస్థితి చాలా క్షీణించిపోయి మరి ఈ వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తుంది.. ఈ వైరస్ వల్ల జ్వరం తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.. 1966వ సంవత్సరంలో మహారాష్ట్ర నాగపూర్ లోని చండీపూర్ అనే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ బయటపడడం జరిగిందట. అప్పట్లో దాదాపుగా 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకు ఈ వైరస్ బారిన పడడంతో చాలామంది మరణించారట.అందుకని ఈ వైరస్ కి చండీపూర్ అనే వైరస్ పేరుగా పెట్టినట్లు తెలుస్తోంది.. అయితే ఈ వైరస్ కారణానికి గురికాకుండా ఉండాలి అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు దోమలు ఈగలు వంటివి ఉండకుండా చూసుకోవాలి ముఖ్యంగా నీరు వంటివి నిల్వ ఉండకుండా చూసుకోవాలట. కేవలం పరిశుభ్రతతోనే ఈ వైరస్ ని అరికట్టగలమని వైద్యులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: