ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది ప్రజలు గతంలో తాత ముత్తాతలు కష్టపడినట్లుగా ప్రస్తుతం ఉన్న ప్రజలు ఎవరూ కూడా పెద్దగా కష్టపడడం లేదు. ఇప్పుడు ప్రజలు ఎక్కువమంది కష్టపడడం కంటే సుఖపడడానికె మక్కువ చూపుతున్నారు. శారీరక కష్టం అలాగే.. ప్రతి ఒక్కరి తత్వంతో కలుపుకుపోయేటువంటి తత్వం కలిగే తరం ఇక అంతరించిపోతోంది. ఎందుకంటే మా తాత ముత్తాతల కాలం నాటి నుంచి అందరూ కలిసి ఉండేవారు.. ఉమ్మడి కుటుంబాలు చాలామంది చూసే ఉంటారు.


అదే సందర్భంలో అమ్మానాన్నల దగ్గరికి వచ్చేసరికి.. విడి కుటుంబాలను చూశాము.. అయితే ఇప్పుడు వ్యక్తులుగా బతకడం చూస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే విషయం పైన ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్టు వైరల్ గా మారుతున్నది. ఆతరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.. రాత్రి సమయాలలో తొందరగా పడుకొని.. ఉదయం తొందరగానే లేచేవారు. ముఖ్యంగా నడకకు అలవాటు పడేవారు. ఎంత దూరమైనా నడిచి వెళ్లేవారు. బయట కల్లాపు చల్లేవారు, ఇంటి ముందు ముగ్గు వేసేవారు.. మొక్కలకు నీరు పోసేవారు.. పూజకి పూలు కోసేవారు పూజ చేసే వరకు ఏమీ తినకుండా ఉండేవారు. మడిగా వంట వండేవారు. దేవుడు గదిలో దీపం వెలిగించేవారు. దేవుడి గుడి కి వెళ్లేవారు.


ప్రతి పని చేసినప్పుడు దేవుడి మీద నమ్మకంతోనే చేసేవారు. మనిషిని విశ్వాసంగా నమ్మి ఎక్కువగా ప్రేమించేవారు.. అందరితో కలిసి మెలసి మాట్లాడుతూ ఉండేవారు.. అంతేకాకుండా జోకులతో కూడా కలిసిమెలిసి కడుపుబ్బ నవ్వుకునేవారు.. స్నేహంగా కూడా పెరిగేవారు.. ఎవరికైనా సహాయం చేసే తత్వం కలిగిన వారు. పెద్దలకు నమస్కారం చేసేవారు. ఉత్తరం కోసం ఆ కాలంలో చాలా మంది ఎదురుచూసేవారు.. పాత ఫోన్లు పట్టుకొని తిరిగేవారు.. ఫోన్ నెంబర్లు వంటివి డైరీలలో రాసి పెట్టుకునేవారు. పండుగలకు , పబ్బాలకు అందరిని పిలిచేవారు.. పిల్లలకు పాలిచ్చి పెంచేవారు.. తనకు కుంకుమపుడి శరీరానికి సున్నిపిండి పెట్టుకునేవారు. ఎన్నో తీర్థయాత్రలు కూడా  చేసేవారు. ఆచారాలు కూడా పాటించేవారు.. తిది నక్షత్రం వంటివి కూడా గుర్తుపెట్టుకునేవారు.. చినిగిన బనియన్లు కూడా తొడుక్కునేవారు.. లుంగీలు, చీరలు కూడా కట్టుకునేవారు. తలకు నూనె రాసుకునేవారు, జడగంటలు పెట్టుకునేవారు, కాళ్ళకి పసుపు రాసుకునేవారు.. చేతికి గాజులు వేసుకునేవారు.. ఇప్పట్లా కాకుండా మనుషులను వాడుకొని స్నేహంగా ఉండేవారు.. ఇప్పుడు వస్తువులను వాడుకొని మనుషులను దూరం చేస్తున్నారు.. అలనాటి తరం ఇకమీదట మూగబోయినట్టే అంటూ ఒక మిత్రుడు రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: