అనంత అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకల గురించి ఇప్పటికీ ఇంకా అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు నెలరోజుల పాటు సాగిన ఈ సంబరాలు అనంతరం అంబానీ తిరిగి వ్యాపారాలలో బిజీ అయ్యారు. వీరి పెళ్లికి చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎంట్రీ ఇవ్వడంతో వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక వివాహం చాలా గ్రాండ్గా జరిగాయి. అయితే ఈ పెళ్లి వేడుక వద్ద అందరిని ఆకర్షించిన వస్తువులలో అనంత అంబానీ కార్లు , వారి కుటుంబం ధరించిన బంగారు ఆభరణాలే కాకుండా దుస్తులు ఇతరత్రా వాటివి కూడా బాగానే ఆకట్టుకున్నాయి.


ముఖ్యంగా వారి దగ్గర ఉండే పెంపుడు కుక్క మరింత ఆకర్షణీయంగా కనిపించిందట. అయితే ఈ కుక్కకు ఒక కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంబానీ కుక్కకు ఉపయోగించే కారు విలువ 4 కోట్ల రూపాయలు ఉన్నదట. ఈ కారు మోడల్ మెర్సిడెస్ బెంజ్ G 400 d లో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అంబానీ ప్రయాణించేటువంటి హై అండ్ సెక్యూరిటీ వాహనాలను ఇది కూడా ఒకటి గతంలో హ్యాపీ టయోటా ఫార్చునర్ కారులో వెళ్లేదట కానీ ఇప్పుడు G -400 D లో వెళ్తున్నట్లు సమాచారం.


హ్యాపీ ముఖేష్ అంబానీ తను ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుందట.  హ్యాపీ న్యూయార్క్ నగరంలో సెంట్రల్ పార్క్ లో హైలెట్గా నిలుస్తూ ఉండడంతో పాటు అక్కడ ఈ కుక్క ఫోటోలు కూడా గతంలో కొన్నిసార్లు వైరల్ గా మారాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో విమానాలలో కూడా ప్రయాణిస్తూ ఉంటారట అందుకు సంబంధించిన ఫోటోలు కూడా చాలా సందర్భాలలో బయటకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఆనంద అంబానీల లగ్జరీ లైఫ్ స్టైల్ కేవలం మనుషులకు మాత్రమే కాదు వారి పట్ల విశ్వాసంగా ఉండే జంతువులకు కూడా అని నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: