ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న ఇద్దరు విదేశీ పర్యాటకులకు ఒక చేదు అనుభవం ఎదురయింది. కొంతమంది హోమ్‌లెస్ కిడ్స్ వారిని డబ్బు కోసం వెంటాడి, చాలా ఇబ్బంది పెట్టారు. ఇద్దరు బాలికలు ఈ టూరిస్టులు ప్రయాణిస్తున్న ఆటోరిక్షాలోకి జంపు చేశారు, ఆ తర్వాత డబ్బు ఇవ్వమని పదే పదే అడుగుతూనే ఉన్నారు. ఒక బాలిక ఆటో రాడ్లను పట్టుకుని ఉండగా, మరొక బాలిక వేగంగా వెళ్తున్న వాహనం వైపు పరిగెత్తి, వెనుక హ్యాండిల్‌ను పట్టుకుని, డబ్బు కోసం అడుగుతూ పర్యాటకులను వేధించింది. పర్యాటకులు ఎంత నిరాకరించినా వారు వెళ్లలేదు.

ఈ సంఘటనను వీడియోలో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన చాలా మంది ప్రజలు ఆ పిల్లల పరిస్థితిని చూసి చాలా బాధపడ్డారు. వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. వైరల్ వీడియోలో, పర్యాటకులు డబ్బు కోసం తమను వేధిస్తున్న నిరాశ్రయుల బృందం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

"మాకు సహాయం కావాలి..." అని వీడియోలో పిల్లలు అరవడం కనిపించింది. ఈ ఘటనతో ఇండియాలో పేదరికం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ పిల్లలు ఫారిన్ టూరిస్టులను డబ్బులు అడుగుతూ ఇబ్బందులకు గురి చేశారు. కొందరు తినుబండారాలు కొనివ్వమని కూడా వేధించారు. కొందరు అయితే డబ్బులు ఇచ్చేదాకా వారిని వదలకుండా టార్చర్ చేశారు. ఇలాంటివి జరగకుండా ఉండటం ద్వారా ఇండియా పరువు కాపాడుకోవచ్చు అని కొందరు పేరు కొన్నారు. ఈ పేద పిల్లలను ఏదైనా హాస్టల్లో చేర్పించి చదివిస్తే బాగుంటుంది కదా అని అన్నారు. పిల్లలు చదువుకుంటే పేదరికం అనేది ఉండదు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని చదివించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం సంపన్నులు ఇందుకు పాటుపడాలి.


 



మరింత సమాచారం తెలుసుకోండి: