ప్రస్తుతం వర్షకాలం కావడంతో సాధారణంగా ఈ సీజన్ లో దోమలు, పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ తో పాటు మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తాయని అందరికి తెలిసిందే. కానీ, తాజాగా  దోమలు, రెక్క పురుగులు  ద్వారా కొత్తగా ఈ చాందిపుర అనే వైరస్ సోకుంతుందట. మరి, ఈ వ్యాధి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్‌లో అనుమానాస్పద వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. దాని వల్ల జులై 10 నుంచి ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 12కు చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్ వెల్లడించారు. బాధితులు సబర్‌కాంతా, ఆరావళి, మహిసాగర్, ఖేడా జిల్లాలకు చెందినవారని మంత్రి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే చాందీపుర వైరస్‌లో ఫ్లూ జ్వరం ప్రధాన లక్షణాలని తెలిపారు.చాందీపుర వైరస్‌ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల నుంచి ఈ వ్యాధి సోకుతుంది. ఇది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులోవైరస్ జాతికి చెందినదిగా వైద్య నిపుణులు గుర్తించారు.కోవిడ్ తర్వాత చండీపురా వైరస్ ఇప్పుడు కొత్త ముప్పుగా మారింది. ఇప్పటికే దేశంలో ఈ వైరస్ కారణంగా 15 మంది చిన్నారులు చనిపోయారు. దీంతో పాటు పలువురు వ్యాధి బారిన పడి ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో చండీపురా వైరస్ ఇన్ఫెక్షన్ నమోదైంది. అందులో అత్యధికంగా సోకిన రాష్ట్రం గుజరాత్. మృతులు, బాధిత చిన్నారుల్లో ఎక్కువ మంది గుజరాత్‌కు చెందినవారే ఉన్నారు.గుజరాత్ కే పరిమితమైన ఈ చాందిపుర వైరస్ మిగిలిన రాష్ట్రాల్లో సంక్రమించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశాలు జారీ చేసింది. అనుమానిత కేసులు ఏమైనా ఉంటే వెంటనే చికిత్స చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అవసరమైన పరీక్షలు చేయడానికి కూడా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రమాదరకమైనదిగా మారడంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని ఎప్పటికిప్పుడు అంచనా వేసుకుంటూ తగిన మందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: