రిలయన్స్ జియో కస్టమర్ల రేటు భారీగా పెంచేశారు దీంతో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కు మారినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా లో ఆనంద్ అంబానీ పెళ్లి ఖర్చులకోసం మా ఫీజులు పెంచాలా అంటూ చాలామంది విమర్శలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈయన నికర ఆస్తిలో కేవలం వారంలోని పెరిగిపోయిందనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ ఇలాంటి సమయంలోనే ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ కేవలం ఒక్క రోజులోనే రూ.73,470 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిందట.. ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ ఇండియాలోనే చాలా అత్యంత విలువైన కంపెనీ అని కూడా చెప్పవచ్చు.
ఫోర్స్ ప్రకారం 976320 కోట్ల రూపాయల నికర విలువ ఆస్తి ఉన్నట్లు గుర్తించబడ్డాడు. ఇది జూలై 22 ఈ ఏడాది 2024 నాటికి . ఈ కంపెనీ చమరు, రిటైల్, టెలి కమ్యూనికేషన్ వంటి రంగాలలో కూడా భారీగానే వ్యాపారం చేస్తోంది. నిన్నటి రోజున ఈ కంపెనీ మార్కెట్ విలువ 73,470,59 కోట్లకు తగ్గి రూ.20,30,488 .32 కోట్లకు చేరిపోయిందట.. జూన్ త్రైమాసికంలో నికర ఆస్తి విలువలో లాభంగా 5% వరకు జీవించిన తర్వాత.. రిలయన్స్ షేర్లు మూడు శాతానికి పైగా పడిపోయాయట. దీంతో చాలా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇలా ఒకేసారి అంబానీ అన్ని కోట్లను కోల్పోవాల్సి వచ్చింది.