దాంపత్య జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోకడలనేవి వస్తూ వస్తున్నాయి. ఎక్కడో మొదలైన కొత్త ట్రెండ్స్, ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా చాలా ఈజీగా  పాకుతున్నాయి. ఇలాంటివి మన సంస్కృతి, సంప్రదాయాలపై ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా లైంగిక జీవితాన్ని ఇతరులతో ఆస్వాదించడం కోసం భర్తలు తమ భార్యలను మార్చుకుంటున్న ఘటన ఈమధ్య కేరళలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కేరళలోనే కాదు చాలా చోట్ల ఇలానే జరుగుతూ ఉంటాయి.భార్య గర్భవతిగా ఉన్న సమయంలో చాలా నెలలు ఆమెతో భర్త సంభోగం చేయడానికి వీలవ్వదు. ఈ సందర్భంలో ఇతర మహిళలతో రిలేషన్ మెయింటెన్ చేయడానికి కొంతమంది పురుషులు ఏకంగా తమ భార్యల అనుమతినే కోరుతున్నారు. ఇది ఇప్పుడు చాలా దేశాల్లో కూడా ట్రెండ్‌గా మారుతుంది.భార్య గర్భం దాల్చితే భర్తకు సెక్స్ లైఫ్‌ను ఆస్వాదించడానికి అవకాశాలు పెద్దగా ఉండవు. అయితే ఇక్కడే కొందరికి ఒక వింత ఆలోచన వచ్చింది. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఇతర మహిళలతో సెక్స్ చేయడానికి కొంతమంది భర్తలు ముందస్తుగా భార్య అనుమతిని తీసుకుంటున్నారు. దీన్ని ‘హాల్ పాస్’ అని అంటున్నారు.


ఈ హాల్ పాస్ ట్రెండ్ గురించి ‘Am I The A**hole?’ సబ్‌రెడిట్‌లో ఒక గర్భిణి చేసిన పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ పెట్టిన మహిళ ప్రస్తుతం ఎనిమిది వారాల గర్భవతి. 13 వారాల దాకా భర్తతో సెక్స్ చేయకూడదని డాక్టర్ సిపార్సు చేశారు. గత సంవత్సరం ఈ జంటకు రెండుసార్లు గర్భస్రావం జరిగింది. అయితే తన భర్త తనను ‘హాల్ పాస్’ అడిగాడని రెడిట్‌లో ఆ మహిళ తెలిపింది. ఈ హాల్ పాస్ అనేది రిలేషన్‌లో వాడే ఒక స్లాంగ్ అట. రిలేషన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక ఒప్పందానికి వచ్చి, వారిలో ఒకరు బయటి వ్యక్తితో సన్నిహితంగా ఉండటానికి పర్మిషన్ తీసుకోవడాన్ని హాల్‌పాస్ అని అంటారు. ఈ హాల్‌పాస్ గురించి గర్భిణి రెడిట్ పోస్టులో ఇలా రాసుకొచ్చింది.'మేమిద్దరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. నా భర్త నాతో సెక్స్ చేయనప్పటి నుంచి మరో మహిళతో సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి హాల్ పాస్ అడుగుతున్నాడు. ఇది కేవలం సెక్స్ కోసం మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని నా భర్త అంటున్నాడు.’ అని పేర్కొంది.‘నా భర్త హాల్‌పాస్‌ అడగడంతో నేను వెంటనే షాక్ అయ్యాను, అందుకు నిరాకరించాను కూడా. కావాలంటే విడాకులు తీసుకుని ఎంత మంది మహిళలతోనైనా నచ్చినట్లుగా గడపవచ్చని వార్నింగ్ ఇచ్చాను’ అని చెప్పిన మహిళ, దీనిపై నెటిజన్ల అభిప్రాయాలని కోరింది. ఇక దీనిపై చాలామంది రెస్పాండ్ అయ్యి ఆమెను సమర్థించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: