ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ప్రతి చోటుకు పాకిపోయింది. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో రకాల ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇలాంటి ఘటనల్లో కొన్ని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. వామ్మో ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే అనుకున్నాం. కానీ నిజజీవితంలో కూడా జరుగుతాయ అని ప్రతి ఒక్కరు కూడా నోరెళ్ళ పెడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహ ఘటన గురించే. సాధారణంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సుదూర  ప్రాంతాలకు వెళ్లే బస్సులో ఇక ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. కొంత దూరం పాటు ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తే.. ఇంకొంత దూరం మరొకరు  డ్రైవింగ్ చేయడం చూస్తూ ఉంటాం.


 అయితే అటు సాదాసీదా ఆర్టీసీ బస్సులో ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఒకరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇంకొకరు ఇక బస్సులోకి ఎక్కిన ప్రయాణికుల దగ్గర టికెట్లు తీసుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కూడా ఇద్దరు సిబ్బంది ఉన్నారు. కానీ ఒకరు డ్రైవింగ్ చేస్తుంటే ఇంకొకరు టికెట్లు తీసుకోవడం కాదు. ఏకంగా ఒకరు స్టీరింగ్ పట్టుకుని బస్సు నడుపుతుంటే ఇంకొకరు గేర్లు వేస్తున్నారు. అదేంటి బస్సు నడిపే వ్యక్తి ఒక్కరే కదా గేర్ వేసుకోవడం స్టీరింగ్ చూసుకోవడం చేస్తూ ఉంటారు. మరి ఒక వ్యక్తి గేరు వేయడం ఇంకొక వ్యక్తి స్టీరింగ్ పట్టుకుని బస్సు నడపడం ఏంటి వినడానికి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా.


 కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఒక షాకింగ్ ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే.. ఒక వ్యక్తి డ్రైవర్ సీట్ లో కూర్చుని స్టీరింగ్ పట్టుకుని బస్సు ముందుకు నడుపుతున్నాడు. ఇంకొక వ్యక్తి డ్రైవర్ పక్కనే కింద కూర్చొని ఒక ఇనుపరాడ్డుతో గేర్లు వేస్తూ ఉండడం చూడవచ్చు. గేరు రాడ్డు విరిగిపోవడంతో బస్సులో ఉన్న మరో డ్రైవర్ చిన్న ఇనుపరాడ్డుతో గేర్లు మార్చడం వీడియోలో కనిపించింది. ఇలా ఇద్దరు ఒకరికి ఒకరు కమ్యూనికేషన్ చేసుకుంటూ.. ఒకరు స్టీరింగ్ తిప్పితే ఇంకొకరు గేర్లు మార్చుకుంటూ బస్సును ముందుకు నడిపించారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఇందుకు సంబంధించిన వీడియోకి మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: