ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఎక్కడ ఏం జరిగినా కూడా అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అడవుల్లో ఉండే ఎన్నో జంతువులు అటు జనాభాసాల్లోకి రావడం లాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇక ఇలా ఎన్నో జంతువులు జనావాసాల్లోకి వస్తు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక మరికొన్ని ఘటనల్లో ఏకంగా సాదు జంతువులు అనుకున్న జీవుల సైతం మనుషులపై పగబట్టినట్లుగానే దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అతివేగంగా వాహనాలు ప్రయాణించే ఒక హైవేపై ఒక ఎద్దు ఎక్కి అక్కడ హల్చల్ చేసింది. ఈ క్రమంలోనే ఆ ఎద్దు తీరు చూసి ఒక వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో తన కారులో ఉన్న ఒక కర్రను పట్టుకుని దానిని బెదరగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి అతనికి చేదు అనుభవం ఎదురయింది.


 అయితే ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో జరిగిన ఘటన సౌదీ అరేబియాలో జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుపైకి వచ్చిన ఒక ఎద్దు హల్చల్ చేయడంతో.. వాహనదారం అందరూ భయపడుతూ ఉండిపోయారు. అయితే వాహనాలు కూడా రోడ్డుపైన నిలిచిపోయాయి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి వాహనంలో నుంచి దిగి ఒక పెద్ద కర్ర తీసుకొని ఎద్దు పై దాడి చేయాలని అనుకున్నాడు. కానీ అంతలోనే ఎద్దు మరింత రెచ్చిపోయింది. ఏకంగా అతనిపై దాడి చేయడానికి వెళ్ళింది. అప్రమత్తంగా ఉన్న సదరు వ్యక్తి ఒక్కసారిగా కారులోకి దూకడంతో చివరికి ప్రాణాలతో బయటపడగలిగాడు. ఇక ఎద్దు వేగంగా వెళ్లి ఆ కార్ డోర్ ని ఢీ కొట్టింది. దీంతో ఆ ఎద్దు ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని వాహనదారులందరూ కూడా మరింత భయపడిపోయారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: