అయితే దక్షిణాఫ్రికా నుండి క్రూజర్ నేషనల్ పార్కులో కూడా ఇలా జంతువుల పోట్లాటలకు కొదవలేదు అని చెప్పాలి. ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలోనే జంతువుల నివసిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో క్రూరమైన జంతువులు వేట సాగించడం ఇక సాధు జంతువులు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం.. ఎప్పుడూ సందర్శకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన దృశ్యంకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా అడవికి రారాజు సింహం. ఇక ఆ సింహాన్ని భయపెట్టే జంతువు అడవిలో మరొకటి ఉండదు.
అయితే పందులే గుంపులుగా వస్తాయ్. సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ కూడా బాగా ఫేమస్. కానీ ఇక్కడ జరిగిన ఘటనలో మాత్రం సింహం గుంపుగా వస్తే ఒక్క జంతువు మాత్రం ఒంటరిగా వచ్చి అన్నింటిని భయపెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇలా సింహాలను భయపెట్టిన జంతువు ఏదో కాదు హిప్పో. ఏకంగా మొత్తం ఐదు ఆడ సింహాలతో ఫైట్ చేయడానికి హిప్పో ముందుకు వచ్చింది. అయితే మొదట హిప్పో దూకుడు ముందు సింహాల గుంపు భయపడినప్పటికీ.. ఆ తర్వాత అడవికి తామే రారాజులం అన్న విషయాన్ని మరోసారి నిరూపించాయి ఆ సింహాల గుంపు. ఏకంగా ఆ నీటి ఏనుగును వేటటానికి ప్రయత్నించడంతో అది భయపడి మళ్లీ నీళ్లలోకి వెళ్లిపోయింది.