ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. కోర్బా - విశాఖ ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయట. దీంతో వెంటనే ఇబ్బంది కూడా అప్రమత్తమయి ఫైర్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిగా రైల్వే సిబ్బంది తో పాటు ఫైర్ ఇబ్బందులు మంటలు ఆర్పినట్టుగా తెలుస్తోంది.. కోర్బా  ఎక్స్ప్రెస్ లోని B6,B7,M-1 భోగిలు సైతం పూర్తిగా బూడిద అయ్యాయట.. భారీగా మంటలు రావడంతో రైల్వే స్టేషన్ పరిసరాలలో ఒక్కసారిగా ఒక పొగ కమ్ముకుపోయింది. అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా రైల్వే సిబ్బంది హుటా హుటిగా బయటికి పంపించేశారు.


అయితే ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు ఒక్కసారిగా ఎలా చెలరేగాయని విషయం పైన అధికారులు ఆరా తీస్తున్నారు... వెంటనే అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టడంతో మిగిలి ఉన్న భోగిలను సైతం కాపాడుకోవడం జరిగిందట .అయితే ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని అక్కడ జాయింట్ సిపీ ఫకీరప్ప తెలియజేశారు.. కేవలం నాలుగు భోగిలలోని ఈ మంటలు చెలరేగిపోయాయని.. వెంటనే మరింత ప్రమాదం జరగకుండా నాలుగు ఫైర్ ఇంజన్ రప్పించి మరి ఈ మంటలను ఆర్పి వేశామంటూ తెలియజేశారు. కానీ ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని తెలియజేశారు.


ఉదయం 6 గంటల సమయంలో ఈ కోర్బా ఎక్స్ప్రెస్ ట్రైన్ విశాఖకు చేరిందని.. విశాఖ రైల్వే స్టేషన్లో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఈ రైలు ఆగి ఉందని అధికారులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మంటలు ఎలా చెలిరేగాయా అనే విషయం పైన పరిశీలిస్తున్నామంటూ తెలియజేశారు.. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఇలాంటి ప్రమాదం జరగలేదని కేవలం కొంతమందికి మాత్రమే గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ దెబ్బతిన్న భోగిలను ఇతర ప్రాంతానికి తరలించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు.మరి ఈ ప్రమాదం పైన అసలు సంఘటన ఏంటనే విషయం పైన అధికారులు తెలియజేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: