ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ట్రెండింగ్‌లో నిలుస్తుంటే ఇంకొన్ని నెటిజన్ల మనసులను కదిలిస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పుడు అనేక రకాల హారన్స్ వినిపిస్తూ ఉంటాయి. కొందరు వాహనదారులు అయితే తమకు నచ్చిన విధంగా హారన్ సౌండ్స్‌ను సెట్ చేసుకుంటూ ఉంటారు. అందులో కొన్ని వెహికల్స్‌కు అయితే డీజే సౌండ్స్‌కు శబ్ధాలు వస్తుంటాయి. మరికొన్ని వాహనాల సౌండ్స్ మాత్రం వినసొంపుగా ఉన్నా చాలా వరకూ తలనొప్పిని తెచ్చిపెడుతుంటాయి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వాహనానికి కూడా ఓ సెపరేట్ సౌండ్ ఉంది. ఓ ట్రక్‌కు సంబంధించిన హారన్ సౌండ్ పిల్లల చేత తెగ డ్యాన్స్ చేయించింది.

ఇండోనేషియాకు చెందిన ఆ వాహనం సౌండ్‌కు ఇద్దరు పిల్లలు డ్యాన్స్ వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రక్ హారన్ సౌండ్‌కు పిల్లలు వేసిన డ్యాన్స్ అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. ఇండోనేషియాలో ఓ రోడ్డుకు పక్కన ఇద్దరు పిల్లలు ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడే అటువైపు నుంచి ఓ  ట్రక్ వచ్చింది. ఆ ట్రక్ వస్తూ వస్తూ హారన్ సౌండ్‌ను వినిపించింది. అప్పుడు అక్కడున్న పిల్లలు ఆ వాహనం సౌండ్‌కు తగ్గ బీట్‌ను వేశారు. హారన్ సౌండ్‌కు పులకరించిపోతూ తెగ డ్యాన్స్ వేశారు.

హారన్ సౌండ్ చేసిన ఆ ట్రక్‌పై ది వండర్ ఉమెన్ అనే కోట్ రాసుంది. పిల్లలు డ్రైవర్ చూస్తున్నాడనే భయం కూడా లేకుండా ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేయడం అక్కడున్న వారికి నవ్వులు తెప్పించింది. హారన్ సౌండ్‌కి తగ్గట్టుగా పిల్లలు డ్యాన్స్ మూమెంట్స్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోకు ఇప్పటి వరకూ రెండు మిలియన్ల వరకూ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: