సాధారణంగా పామును చూస్తేనే చాలామందికి కళ్లు తిరిగినంత పని అవుతుంది. ఇక అవి దగ్గరికి వచ్చాయంటే పైప్రాణాలు పైనే పోతాయి. స్నేక్ కాటు వేస్తే ఇక తాము చనిపోయినట్లే అని ఆశలు వదిలేస్తుంటారు ప్రజలు. కొందరు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. పాములు కాటేసిన ఏమీ భయపడరు. అంతేకాదు కాటేసిన పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి ఈ పామే తమను కాటేసింది అని, వైద్యం చేయాలి అంటూ కొరతారు. ఇలాంటి ధైర్యవంతులకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్‌ అవుతుంటాయి. వీటిని చూసిన ప్రతిసారి కూడా నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు. తాజాగా అలాంటి మరొక ఆశ్చర్యకరమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ప్రస్తుతం భారతదేశంలో వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల చాలా పాములు జనావాసాల్లోకి వచ్చి వెచ్చని ప్రదేశాల్లో పడుకుంటున్నాయి. వీటిని చూడకుండా ప్రజలు నడుచుకోవడం వల్ల కాటు వేస్తున్నాయి. ఇలా కాటు వేసిన వెంటనే చికిత్స అందించకపోతే ప్రజలు మరణించే ప్రమాదం ఉంది. చందౌలీలో ఓ యువకుడి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అందుకే తనను పాము కాటు వేసిన వెంటనే దాన్ని ఓ సంచిలో బంధించి దాన్ని తీసుకొని ఆస్పత్రికి చేరుకున్నాడు.

ఆసుపత్రిలోకి అతను పామును పట్టుకొని రావడంతో ఆసుపత్రి సిబ్బంది భయంతో హడలి పోయింది. పాము కాటు వేసిన అతడు ఏమాత్రం గోల చేయకుండా ప్లాస్టిక్ కవర్లో దాని పట్టుకొని స్పష్టంగా చూపిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతుంది. అతడి ధైర్యాన్ని చూసి చాలా మంది అవాక్కయ్యారు. ఇంత సాహసం చేసిన ఆ వ్యక్తి గుండె బతకాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వ్యక్తి బతికాడా? సకాలంలో వైద్యులు వైద్యం అందించారా అనేది తెలియ రాలేదు. ఆ పాము రక్తాన్ని కొంచెం సిరంజిలోకి తీసుకొని దాన్ని పరిశీలించి, అందుకు అనుగుణంగానే ఇతనికి చికిత్స చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

https://x.com/News1IndiaTweet/status/1822903078481269219 ఈ లింకపై క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: