కొందరు పోలీసులు మాత్రం భర్తే మిగతా కుటుంబ సభ్యులను చంపి తను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేడీ కానిస్టేబుల్ నీతు కుమారితో పాటు ఆమె భర్త పంకజ్, ఇద్దరు పిల్లలు శివన్ష్ (4.5 సంవత్సరాలు), శ్రేయ (3.5 సంవత్సరాలు), అత్త ఆశాదేవి (65 సంవత్సరాలు) ఒకే ఇంట్లోనే ఉండేవారు. పంకజ్ రాసిన ఆత్మహత్య లేఖ ప్రకారం, నీతు ఇద్దరు పిల్లలను, తన అత్తను చంపింది. ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పంకజ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. పంకజ్ తన భార్య నీతుకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని కూడా సూసైడ్ లెటర్ లో రాశాడు. ఆ లేఖలో, నీతు తన అత్త, పిల్లలను చంపడానికి కారణం ఆమెకు వేరొకరితో అక్రమ సంబంధం ఉండటమే అని పంకజ్ పేర్కొన్నాడు. కోపంతో ఆమెను చంపి, తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు.
ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే మంగళవారం ఉదయం 9 గంటలకు పాలువాడు లేడీ కానిస్టేబుల్ ఇంటికి వచ్చాడు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో పొరుగువారు అనుమానించి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ అందరూ చనిపోయి ఉన్నట్లు చూసి పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి అందరి మృతదేహాలను తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ లింక్ పై నొక్కి https://x.com/TrueStoryUP/status/1823632115902153118?t=5IfDrB3hiKM4ZnYGFvY4sg&s=19 ఈ సంఘటన గురించి పోలీస్ చెప్పిన వివరాలు తెలుసుకోవచ్చు.