ఈ కొత్త వైరస్ వ్యాధి వ్యాప్తి చెందడం వల్ల శాస్త్రవేత్తలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇది ప్రజలలో మరింత సులభంగా వ్యాప్తి చెందేలా ఉందంటూ తెలియజేస్తున్నారు. శాస్త్రవేత్తలు మొదటిసారిగా 1958లో మంకీ పాక్ లాంటి వ్యాధి అన్నట్లుగా గుర్తించారు. అయితే ఇది త్వరగానే వ్యాప్తి చెందుతూ ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఇది ఎక్కువగా మధ్య పశ్చిమ ఆఫ్రికాలో జంతువులతో ఎక్కువ అనుబంధాలు కలిగే ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ కేసులు ఎక్కువగా సోకినట్లు WHO గుర్తించింది. ఇందులో చాలానే మానవ కేసులను కూడా గుర్తించారట.
2002లో వైరస్ మొదటిసారిగా శారీరక సంపర్కం ద్వారా వ్యాపించింది అన్నట్లుగా అధికారులు గుర్తించారట.. ప్రపంచవ్యాప్తంగా 70 కంటే ఎక్కువ దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం అయ్యిందని తెలుపుతున్నారు. దీంతో కేసులు కూడా తీవ్రంగా అవుతున్న సమయంలో WHO తెలియజేస్తూ ఈ వైరస్ సోకిన వ్యక్తులకు ముఖం చేతులు, చాతి జ్ఞానేంద్రియాల పైన గాయాలు ఏర్పడే అవకాశం ఉందని పిల్లలకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ వ్యాధి సోకేందుకు ఆస్కారం ఉన్నట్లు తల్లితండ్రులను హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో అటు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.