ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక సర్వేని తాజాగా చేయించిందట.ఈ సర్వేలో మద్యం వినియోగించే వారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ అధికంగా పట్టణాలు నగరాలలో మద్యం సేవిస్తున్నారు అలాగే పురుషులకు స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను కూడా తెలియజేసిందట. ముఖ్యంగా నగరాలలో కంటే ఎక్కువగా గ్రామాల్లోని మద్యం సేవిస్తున్నట్లుగా ఈ సర్వేలో తేలిందంటూ అధికారులు తెలియజేస్తున్నారు. బీహార్, మిజోరాం, నాగాలాండ్, గుజరాత్ వంటి ప్రాంతాలలో మద్యపానం నిషేధం ఉన్నది.


అయితే ఈ సర్వేలో తెలిపిన ప్రకారం దేశంలో నగరాలలో నివసించే వారి కంటే ఎక్కువగా గ్రామాలలో నివసించే వారే చాలా ఎక్కువగా మధ్యాన్ని తాగుతున్నారట. ముఖ్యంగా 15 ఏళ్లు వయసు కంటే ఎక్కువగా ఉన్న పురుషులలో 18.7% 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు 1.3% మద్యపానం చేస్తున్నారట. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో విభజిస్తే.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు 1.6% మంది ఉండగా పట్టణ ప్రాంతంలో 0.6% మంది మద్యం తాగుతున్నారట.. పురుషుల విషయానికి పట్టణానికి వస్తే 16.5% ఉండగా గ్రామీణ ప్రాంతాలలో 19.9% ఉన్నారట.



దేశంలోని అత్యధికంగా తాగుబోతులుగా ఉన్న రాష్ట్రం ఏమిటంటే అరుణాచల ప్రదేశ్ మొదటి స్థానం.. ఏకంగా 52.6% ఉన్నదట. ఆ తర్వాత స్థానం తెలంగాణ 43.4% ఉన్నది. ఆ తర్వాత సిక్కిం-39.9%, ఆ తర్వాత అండమాన్ 38.8%, మణిపూర్-37.2%, గోవా-36.8%, చతిస్గడ్ -34.7% అంటే ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి.



ఇక తక్కువగా మద్యపానం చేస్తున్న రాష్ట్రాల విషయానికి వస్తే అగ్రస్థానంలో ఉన్నది ఇక్కడ కేవలం..0.4 % మంది మాత్రమే ఉన్నారు.. ఆ తర్వాత గుజరాత్-5.8%, జమ్మూ కాశ్మీర్ 8.7%, రాజస్థాన్-11%, మహారాష్ట్ర-13.9%, ఉత్తరప్రదేశ్-14.5% కలిగి ఉన్నాయి.


మహిళల విజయానికి వస్తే అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్లో 24.2% మంది తాగుతున్నారట.. సిక్కిం లో 16.2%, అస్సాంలో 7.3%, తెలంగాణలో 6.7%, జార్ఖండ్లో 5.7%, చతిస్గడ్ 4.9% ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. 2022 వరకు ఉన్నటువంటి సమాచారం. తదు పరి 2026 లో విడుదల చేయబడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: