ఇటీవల కాలంలో విమానాల్లోనే కాకుండా ఎయిర్‌పోర్ట్స్‌లో కూడా షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చికాగోలోని ఒహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ బీభత్సం సృష్టించింది. ఫ్రాంటీర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈమె ప్రయాణించాల్సి ఉంది అయితే దానిని ఎక్కడంలో అని మిస్ అయింది. మిస్ అయినందుకు చాలా కోపంతో ఎయిర్‌పోర్ట్‌లో చిందులు తొక్కింది. ఈ మహిళ ఫ్రాంటీర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులపై మానిటర్ స్క్రీన్‌లను విసిరి కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ వీడియోలో ఆమె చెక్-ఇన్ కౌంటర్ దాటి ఎక్కి, ఎయిర్‌లైన్స్ ఉద్యోగులపై కేకలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక ఉద్యోగి ఆమెను శాంతపరచడానికి వెనక్కి నెట్టినప్పుడు, ఆమె ఒక కంప్యూటర్ మానిటర్‌ను తీసుకొని ఆ ఉద్యోగి కడుపుపై విసిరింది. ఆ 31 ఏళ్ల మహిళ మరొక వ్యక్తిని కూడా కొట్టింది. ఆ తర్వాత, ఆమె మళ్ళీ కౌంటర్ దాటి ఎక్కి, ఉద్యోగులను 'మూర్ఖులు' అని దారుణంగా తిట్టేసింది. ఇంతటి గందరగోళం సృష్టించిన తర్వాత, ఆమె విమానాశ్రయం నుండి పారిపోయింది.

ఈ సంఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. ఆ మహిళ తన విమానాన్ని మిస్ అయిన తర్వాత ఈ గొడవ జరిగింది. ఈ విషయం తెలిసి పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి ఆ మహిళ పాస్‌పోర్ట్‌ను తీసుకున్నారని ఆ ప్రయాణికుడు చెప్పాడు. ముందుగా చెప్పుకున్నట్లు ఇటీవల కాలంలో విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు అల్లరి చేసిన చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గత సంవత్సరం, హ్యూస్టన్ నుంచి డెన్వర్‌కు వెళ్తున్న ఫ్రాంటీర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక మహిళ చాలా అల్లరి చేసిన వీడియో వైరల్ అయింది. ఆ మహిళ ఏడుస్తూ, కేకలు వేస్తూ, విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులతో గొడవ పడుతూ ఉంది. ఆమెను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ లింక్ https://x.com/tecas2000/status/1823829754010599782?t=eKdI2CQbJUk0qbkTATe8aA&s=19 పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: