అక్కలు, తమ్ముళ్ల మధ్య ఎప్పుడూ కొట్లాటలు జరుగుతుంటాయి. వీరి అల్లరి మామూలుగా ఉండదు. ప్రస్తుతం భారతదేశంలో రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు కూడా అక్కలు తమ తమ్ముళ్ళను వీర కొట్టుడు కొడుతున్నట్టు ఉన్నారు. తాజాగా ఓ సిస్టర్ బ్రదర్ మధ్య ఫైటింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక చిన్న అమ్మాయి తన తమ్ముడిని కొట్టి, జుట్టు లాగే అతన్ని ఏడిపిస్తుంది. ఈ వీడియో చూస్తే పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ కలిసి నవ్వుకునేందుకు బాగుంటుంది

"ఆ వీడియోలో, చిన్న అమ్మాయి తన తమ్ముడి తల మీద తేలిగ్గా కొడుతూ, జుట్టు పట్టుకుంటూ ఉంటుంది. తమ్ముడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా, అక్క అతన్ని వదలకుండా ఇబ్బంది పెడుతుంది. చివరకు తమ్ముడు చాలా బాధపడి ఏడుస్తున్నాడు. కానీ, అమ్మాయి మాత్రం గెలిచినట్లుగా నిలబడి ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసి ప్రేక్షకులు బాగా నవ్వుకుంటున్నారు.

ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారా లేక గొడవ పడుతున్నారా అని అర్థం కాకపోయినా, ఈ వీడియో చూసిన చాలా మందికి తమ బాల్యం గుర్తుకు వచ్చింది. తమ అన్నదమ్ములతో ఇలాగే ఆడుకున్న రోజులు గుర్తుకొచ్చి నవ్వుకున్నారు.

ఆగస్టు 19న పోస్ట్ చేసిన ఈ వీడియోని చాలా మంది చూశారు. ఈ వీడియో చూసిన వారు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ, అన్నదమ్ముల మధ్య జరిగే అల్లరి లేని రాఖీ పండుగ అంత ఆనందంగా ఉండదని చెప్పారు. ఈ వీడియోలోని హాస్యం, అన్నదమ్ముల మధ్య ప్రేమ చూసి ప్రతి ఒక్కరికి తమ బాల్యం గుర్తుకు వచ్చింది.ఈ వైరల్ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. దీన్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు. దీని మీరు కూడా చూసేయండి. ఈ రాఖీ ఫెస్టివల్  ను నవ్వులతో గడిపేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ఇండియా హెరాల్డ్ తరచూ చెక్ చేస్తూ ఉండొచ్చు.








మరింత సమాచారం తెలుసుకోండి: