వృత్తిరీత్యా టీచర్‌గా అయిన ప్రత్యూష ఫణీంద్ర అనే అబ్బాయిని ఆగస్టు 23వ తేదీ పెళ్లి చేసుకోనుంది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం తనకు అనుగుణంగానే జరగాలని ప్రత్యూష అనుకుంది. ఇరు కుటుంబ సభ్యులు అతిథులను పెళ్లికి పిలిచే పనిలో పడ్డప్పుడు ప్రత్యూష కి ఒక అదిరిపోయే ఐడియా వచ్చింది. అదేంటంటే తన పెళ్లి పత్రిక తన తన ప్రొఫెషన్‌కు తగినట్లుగా డిజైన్ చేయిద్దామని ఆమె అనుకుంది. తన టీచర్ బ్రెయిన్ కి కొంచెం పని పెట్టి క్వశ్ఛన్ పేపర్ రూపంలో పెళ్లిపత్రిక చాలా వినూత్నంగా తయారు చేయించింది. ఈ శుభలేఖలో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం ఇవ్వాలంటూ ప్రత్యూష తన బంధుమిత్రులకు ఇన్విటేషన్ కార్డ్స్ సెండ్ చేసింది.
ఈ ఆహ్వాన పత్రికలో సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్, ట్రూ-ఫాల్స్ క్వశ్చన్స్‌లు ఉన్నాయి. దీన్ని మొదటిగా చూసినప్పుడు ఇది వెడ్డింగ్ కార్డా లేదంటే క్వశ్చన్ పేపరా అని ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఈ క్వశ్చన్లు ఏవో ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ బుక్స్ నుంచి తీసుకున్నవి కావు. మీ ఫ్యామిలీకి సంబంధించిన సింపుల్ వివరాలే.
తన పెళ్లాడే వరుడి వివరాలు, వరుడి తల్లిదండ్రుల వివరాలు, అలానే తన పేరెంట్స్ డీటైల్స్, వెడ్డింగ్ వెన్యూ, సుముహూర్తం లాంటి వివరాలను ఫీల్ చేయాల్సిందిగా ఈ ప్రశ్నాపత్రం లాంటి పెళ్లిపత్రికలో అడిగారు. మొదట దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు కానీ తర్వాత ఈ టీచర్ తెలివి చూసి నవ్వుకున్నారు మరి కొంతమంది ఆమెను మెచ్చుకున్నారు. ఈ శుభలేఖ సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో చాలామంది కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.