మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రేపిస్టులకు త్వరగా శిక్ష పడటం లేదు. ఈ కామాంధులు పశువుల్లాగా అమ్మాయిలను రేప్ చేసి చంపేస్తున్నా వారికి చాలా అరుదుగా ఉరి శిక్షలు పడుతుంటాయి. అయితే ఒక తల్లి తన కూతురి జీవితాన్ని నాశనం చేసి ఆమెను చంపేసిన వ్యక్తిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేసింది. ఈమె స్టోరీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ చిన్నారి హత్య కేసు విచారణ జరుగుతున్న కోర్టు హాలులోనే ఆమె రేపిస్టును చంపేసింది. ఆ సమయంలో నిందితుడు కోర్టులో నిలబడి ఉన్నాడు. జడ్జి, లాయర్లు విచారణపై దృష్టి సారించారు. అంతలోనే, ఒక బుల్లెట్‌ శబ్దం అందరినీ ఉలిక్కిపడేల చేసింది. ఆ బుల్లెట్ నిందితుడికి తగిలింది. అతను వెంటనే కిందపడ్డాడు. అందరి కళ్ళు ఆ శబ్దం వచ్చిన వైపు తిరిగాయి. అక్కడ ఒక నల్లని కోటు వేసుకున్న మహిళ తుపాకీని పట్టుకుని నిలబడి ఉంది. తుపాకీ కాల్చిన తర్వాత, ఆమె కూల్ గా తుపాకీని కింద పెట్టి నిశ్చలంగా నిలబడింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, ఆమె ఎలాంటి ప్రతిఘటన చూపించలేదు. ఆమె ముఖం మీద న్యాయం జరిగిపోయిందనే సంతోషం కనిపించింది. ఆమె దోషిని కాల్చడం మీరు ఈ లింక్ https://twitter.com/yogitabhayana/status/1825389272016584709?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1825389272016584709%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2Fపై క్లిక్ చేసి చూడవచ్చు.

నల్లని కోటు వేసుకున్న ఆ మహిళ పేరు మారియన్ బాచ్‌మైయర్. ఆమె జీవితం కష్టాలతో నిండిపోయింది. పశ్చిమ జర్మనీలో పేదరికంలో పెరిగిన మారియన్ తండ్రి నుంచి చాలా ఇబ్బందులు పడింది. 16 ఏళ్లకే తల్లి అయింది. తన మొదటి ఇద్దరు పిల్లలను చూసుకోలేక వారిని దత్తతకు ఇచ్చివేసింది. 19 ఏళ్లకు పెళ్లి చేసుకుని, అన్నా అనే ఒక కూతురును కన్నది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత, అన్నా ఆమె ప్రపంచమంతా అయిపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, మారియన్, అన్నా మంచి జీవితం గడిపారు. అయితే, 1980 మే 7న వారి జీవితం పూర్తిగా మారిపోయింది.

ఆ దురదృష్టకరమైన రోజు, ఏడేళ్ల అన్నా స్కూలు నుంచి ఇంటికి వచ్చింది. తల్లితో ఉదయం జరిగిన గొడవ ఇంకా ఆమె మనసులో ఉంది. ఆమె భోజనం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది, కానీ తిరిగి రాలేదు. మారియన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత, నిజం బయటపడింది. పక్కింటివాడైన క్లాస్ గ్రాబోస్కీ అన్నాను అత్యాచారం చేసి చంపి, ఆమె శవాన్ని కాలువలో పడేశాడని ఒప్పుకున్నాడు. ట్రయల్ సమయంలో, గ్రాబోస్కీ అన్నా తనను బ్లాక్‌మెయిల్ చేసిందని అబద్ధం చెప్పాడు. దీంతో మారియన్‌కు మరింత బాధ కలిగింది.

1981 మార్చి 6న, కోర్టు విచారణ సమయంలో మారియన్ తనకు తానే న్యాయం చేసుకుంది. .22 కాలిబర్ బెరెట్ట తుపాకీతో గ్రాబోస్కీని ఎనిమిదిసార్లు కాల్చి చంపింది. సాక్షులు చెప్పిన ప్రకారం, ఆమె తన కూతురి ప్రాణం తీసిన వ్యక్తిని చూసి కోపంతో రగిలిపోయింది. "ఒరేయ్ పంది, నీకు ఇదే తగిన శిక్ష" అని అరిచింది. ఆమె చేసిన పని దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ట్రయల్ అంతా ఆమె చేసిన పని గురించి కాకుండా, న్యాయ వ్యవస్థలోని లోపాల గురించి చర్చ జరిగింది. చాలామంది ఈ తల్లి పట్ల తాను పోతే చూపించారు 15,000 మంది లెటర్స్ పంపించి ఆమెను క్షమించాలంటూ కోరారు. అయితే కోర్టు ఆరేళ్ల శిక్ష ఆమెకు విధించింది. మూడేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత ఆమె రిలీఫ్ చేశారు. తర్వాత విదేశాలకు వెళ్లిపోయింది. అయితే క్యాన్సర్ వ్యాధి రావడం వల్ల 1996లో మరణించింది. ఆమె శవాన్ని తన ప్రియమైన కూతురి సమాధి పక్కనే ఖననం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: