ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రంలో క్రైమ్స్ రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసి మిగతా రాష్ట్రాల ప్రజలు షాక్ అవుతున్నారు. యూపీ ప్రజలు కొందరు సైకో లాగా ప్రవర్తిస్తూ ఇతరులకు హాని చేస్తున్నారు. కొందరైతే తమకు తామే హాని చేసుకుంటూ భయం కలిగిస్తున్నారు. తాజాగా బులంద్‌షహర్‌ సిటీలో ఓ టెంపో డ్రైవర్ తన వాహనాన్ని తానే తగులబెట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఈ డ్రైవర్ తన టెంపోను ‘నో పార్కింగ్’ అని ఉన్న చోట పార్క్ చేశాడని ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. దాంతో కోపం తెచ్చుకున్న ఈ డ్రైవర్ దానికి నిప్పు అంటించి తగలబెట్టాడు. ఈ డ్రైవర్ ఈ ఏడాది మార్చిలోనే ఈ కొత్త టెంపోను కొనుగోలు చేశాడు. ట్రాఫిక్ పోలీసులతో జరిగిన వాగ్వాదం తర్వాత కోపంతో ఆయన తన కొత్త వాహనాన్ని తగులబెట్టేశాడు. ఈ విషయాన్ని పోలీసులు వెంటనే ఫైర్ బ్రిగేడ్‌కు తెలియజేశారు. ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

బులంద్‌షహర్‌లో టెంపోను తగులబెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఖీ పండుగ సందర్భంగా ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులు విధుల్లో ఉన్నారు. స్థానికుల ప్రకారం, పహాసు-ఖుర్జా రోడ్డుపై ఓ లోడ్ లేని టెంపోను పార్క్ చేశారు. దీనిపై కరౌరి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ జరిమానా విధించారు. డ్రైవర్ మొదట వాహనాన్ని మరో చోటికి తీసుకెళ్లి, తర్వాత తిరిగి వచ్చి తన టెంపోను తగులబెట్టాడు. అతను ఈ ఘటన జరిగిన సమయంలో మద్యం తాగిన స్థితిలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

డ్రైవర్ మాత్రం పోలీసే తన టెంపోను తగులబెట్టారని ఆరోపిస్తున్నాడు. అతని ప్రకారం, అతను రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం నుంచి సరుకులు కొనడానికి తన వాహనాన్ని పార్క్ చేశాడు. ఆ సమయంలో ఓ ట్రాఫిక్ పోలీస్ అతనికి జరిమానా విధించాడు. దీనికి అతను అభ్యంతరం తెలిపాడు. దీంతో కోపగించుకున్న పోలీస్, ప్రతీకారంగా అతని టెంపోను తగులబెట్టారని డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. మరి ఇక్కడ ఎవరిది తప్పు అనేది ఇంకా తెలియ రాలేదు ఈ వైరల్ వీడియోను చూడడానికి https://twitter.com/SachinGuptaUP/status/1825719162548658495?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1825719162548658495%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F లింక్ పై క్లిక్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: