గడిచిన రెండేళ్ల క్రితం కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.. ఆ తర్వాత పలు రకాల వైరస్తులు సైతం కొత్తగా పుట్టుకొస్తున్నా యి. గత కొద్దిరోజులకు క్రితం మంకీ ఫాక్స్ అనే వైరస్ కూడా అన్ని ప్రాంతాలలో వ్యాపిస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బెంగళూరులో 5 మందికి జీకా వైరస్ సోకినట్లుగా అక్కడ అధికారులు సైతం గుర్తించారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు వెల్లడించారు.


బెంగళూరులో జిగాని నగర్ లో ఆగస్టు 4వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఐదు మందికి ఈ జీకా వైరస్ సోకినట్లుగా గుర్తించామంటూ తెలియజేశారు. మొదట వ్యక్తికి నిర్ధారణ గుర్తించిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి వారికి పరీక్షలు సైతం నిర్వహించారట ఆ తర్వాతే మిగతా వారిని గుర్తించినట్లుగా తెలియజేశారు.ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా జికా వైరస్ సాధారణ లక్షణాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. వీటికి డెంగ్యూ తో సమానమైన చికిత్స కూడా ఉంటుందంటూ తెలియజేశారు.




Who తెలిపిన ప్రకారం.. జికా వైరస్ లక్షణాలు.. చర్మ పైన దద్దుర్లు రావడం, కీళ్ల నొప్పులు రావడం, జ్వరం రావడం వంటివి ఉంటుందట. అలాగే చాలా కాలం పాటు తలనొప్పి కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు. జ్వరం ఏకంగా 102°f ఉంటుందట. అలాగే శరీరం పైన ఎర్రటి దద్దుర్లు ముఖం మరియు శరీరంలోని భాగాలకు వ్యాప్తి చెందుతుందట. అలాగే కంటి రంగు కూడా ఎరుపు లేదా పింక్ కలర్ లోకి మారుతుందట. తిన్న వెంటనే వాంతులు లేదా కళ్ళలో నొప్పి వంటివి ఉంటాయి అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కండరాల నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది.


వీటిని నివారించాలి అంటే దోమలు ఇంట్లో ఇంటి పరిసరాలలో లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇంటి చుట్టు పరిసరాలలో నేటి ఎద్దడి ఎక్కువగా లేకుండా చూసుకోవడం వల్ల వీటిని అరికట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: