ఒక స్కూల్ ఫంక్షన్‌లో, ఒక బాలుడు జంతువుల శబ్దాలు చేసి ప్రేక్షకులను అలరించాలని అనుకున్నాడు. మనందరికీ తెలుసు కదా, పిల్లలకు జంతువుల శబ్దాలు చేయడం ఎంత ఇష్టమో! అతను మొదటి శబ్దం చేసినప్పుడు, ప్రేక్షకులు అతన్ని చూసి నవ్వారు. “ఇతను ఏం చేస్తున్నాడు? ఇంతటితోనే టాలెంట్ అనుకుంటున్నాడా?” అని అనుకున్నారు. కానీ, అతను తర్వాత చేసిన జంతువుల శబ్దాలు విన్నప్పుడు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అతని టాలెంట్ చూసి అందరూ చప్పట్లు కొట్టారు.

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని రణవాస్ అనే గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ స్కూల్‌లో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక చిన్న పిల్లవాడు తన ప్రతిభను ప్రదర్శించాడు. అతను జంతువుల శబ్దాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను మొదట ఒక నొప్పితో అరుస్తున్న కుక్క పిల్ల లాగా సౌండ్ చేశాడు. చాలామంది ఆ శబ్దం చేస్తారు కాబట్టి, అక్కడున్న వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. కొంతమంది నవ్వారు కూడా. కానీ, తర్వాత అతను ఒక పక్షి శబ్దం చేశాడు. అది పిల్లవాడు చేసిన శబ్దమేనా అని ఒక్క క్షణం బాధతో అందరూ అవిశ్వాసం వ్యక్తం చేశారు. తర్వాత ఆ శబ్దం పిల్లవాడే చేస్తున్నాడని తెలిసి అందరూ చప్పట్లు కొట్టారు.

ఆ తర్వాత, అతను కోయిల శబ్దం చేశాడు. నిజంగా కోయిలే అరుస్తుందా అనిపించేంతలా గట్టిగా ఆ సౌండ్ లిమిటెడ్ చేశాడు. చివరగా, మేక శబ్దం చేశాడు. దాంతో  అప్పుడు అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ పిల్లవాడు ప్రదర్శన ఇస్తున్నప్పుడు, ప్రేక్షకుల ముఖాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట అతన్ని ఎవరూ పట్టించుకోలేదు, కానీ తర్వాత అతని ప్రతిభను గుర్తించారు.

ఈ వీడియోను 5 మిలియన్ల మందికి పైగా చూశారు. చాలామంది తమ అభిప్రాయాలను కామెంట్‌లలో వ్యక్తం చేశారు. కొందరు "క్లాస్‌లో వెనక కూర్చునే పిల్లలకి ఇంతటి ప్రతిభ ఉందా!" అని ఆశ్చర్యపోయారు. మరికొందరు "ఈ పిల్లవాడికి అద్భుతమైన ప్రతిభ ఉంది" అన్నారు. మరికొందరు "ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో న్యూటన్ లాంటి వాళ్ళు అవుతారు" అని అన్నారు. ఈ లింక్ https://www.instagram.com/reel/C-tmOg6yQRa/?utm_source=ig_web_copy_link పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: